సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంతమంది స్టార్ కిడ్స్ సినిమాలకు దూరంగా భిన్నమైన కెరీర్ ని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో దగ్గుబాటి ఆశ్రిత ఒకరు. టాలీవుడ్ టాప్ మోస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవరాలిగా, హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురిగా ఆశ్రిత సుపరిచితమే. ఇంతటి సినిమా బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఆశ్రిత.. మొదటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూనే.. యూకేలో స్టడీస్ పూర్తిచేసింది. ఆ తర్వాత కూడా సినిమాలవైపు చూడకుండా తనకు బాగా ఇష్టమైన ఫుడ్ వ్లాగింగ్ నే కెరీర్ గా ఎంచుకుంది. అప్పటినుండి తనకు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తోంది.
ఇన్నాళ్లు బయటికి పెద్దగా వినిపించని ఆశ్రిత పేరు.. ఇప్పుడెందుకు వార్తల్లోకెక్కింది. అనంటే.. అందుకు కారణం హీరో అక్కినేని నాగచైతన్యతో చేసిన వ్లాగ్ వీడియోనే అని చెప్పాలి. రీసెంట్ గా ఆశ్రిత.. చైతూతో కలిసి ‘మా బావతో అమేజింగ్ ఫీస్ట్’ అంటూ ఓ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. అంతే.. అప్పటినుండి వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. కాగా.. ఆశ్రిత తన బావ చైతూతో చేసిన వీడియో కూడా ఫుడ్ కి సంబంధించే కావడం విశేషం. ఆశ్రితకి ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అని ఒకే పేరుతో అకౌంట్స్ ఉన్నాయి. వాటిలోనే తన రెగ్యులర్ అప్ డేట్స్, వ్లాగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది.
ఇక 2019లో చిన్ననాటి స్నేహితుడు వినాయక్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆశ్రిత. వినాయక్ రెడ్డి.. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డి మనవడు అని సమాచారం. కాగా.. కాలేజీలో పరిచయమై, ప్రేమించుకున్న ఆశ్రిత – వినాయక్ రెడ్డి స్టడీస్ కంప్లీట్ అయ్యాక.. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఫారెన్ లో ఉంటూ.. ఫుడ్ వ్లాగ్స్ చేస్తోంది. అయితే.. మొదట్లో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న ఆశ్రిత.. కొంతకాలంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా తన ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ బిజినెస్ డెవలప్ చేసే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం ఆశ్రిత.. చైతూతో చేసిన వీడియోతో మళ్లీ నెట్టింట యాక్టీవ్ అయ్యింది. సో.. ఆశ్రిత కెరీర్ పరంగా స్పీడ్ పెంచిందని దగ్గుబాటి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రిత పిక్స్ వైరల్ గా మారాయి.