సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాయలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినీరంగంలో ప్రేమలు, డేటింగ్ లో సర్వ సాధారణం. ఎవరు.. ఎవరితో ఎప్పుడు లవ్ లో ఉంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారు చెప్పడం చాలా కష్టం. అందుకే దాదాపు ఎక్కువ మంది సెలబ్రిటీలు తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకి రానివ్వరు. చాలా తక్కువ మంది తమ లవ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్, అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది. ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ప్రేమలో పడింది. గతంలో మిషాల్ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్‌లో ఉన్న ఐరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్-ఐరాల మధ్య మనస్పర్థలు రావడం వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఐరాఖాన్ తన ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరేతో ప్రేమలో పడింది. అప్పట్లో కొన్నేళ్లు ఆమిర్‌కు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరించిన నుపూర్.. లాక్‌డౌన్ నుంచి ఐరాకు కూడా జిమ్ వర్కౌట్ల విషయంలో కోచ్ గా మారారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి నుపూర్ వ్యక్తిత్వం నచ్చడం వల్ల ఐరా అతనితో ప్రేమలో పడిందని.. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం కూడా సాగుతోంది. అయితే తాజాగా తమ ప్రేమ విషయంపై ఐరా ఖాన్ క్లారిటీ ఇచ్చింది. తాము ప్రేమించుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలిపింది.
సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇటీవల నుపుర్ విదేశాలకు వెళ్లాడు. అతడి తోడుగా ఐరా సైతం వెళ్లింది. ఈ సైక్లింగ్ పోటీలు ముగిసిన వెంటనే నుపుర్ ఐరా వద్దకు చేరుకుని మోకాళ్లపై కూర్చొని.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతాడు. దీనికి ఐరా.. ఎస్ అంటూ అతడి ప్రేమను యాక్సెప్ట్ చేసింది. అనంతరం నుపుర్.. ఐరాకి ఉంగరం తొడిగి తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఐరాను హత్తుకుని నుపుర్ లిప్ లాక్ కిస్ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోని ఐరా తాజాగా తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. నేను ఎస్ చెప్పాను.. అని ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు బాలీవుడ్ సెలబ్రీటిలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. మరి… ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.