సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి స్టార్ హీరోలు ఇచ్చే స్టేట్ మెంట్స్ అభిమానులను షాక్ కి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ విషయంలో అభిమానులు షాక్ లోనే ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని ఆమిర్ చేసిన స్టేట్మెంట్ కారణం. అవును.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మొదటిసారి నటుడిగా లైఫ్ లో బ్రేక్ తీసుకుంటున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించాడు. దాదాపు ముప్పై ఐదేళ్లపాటు నటుడిగా బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేశానని.. అలాగే ఇప్పుడు తాను తన ఫ్యామిలీతో సమయాన్ని గడపాలని భావిస్తున్నట్లు తెలిపాడు. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయంపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. “నేను గత ముప్పైఐదు సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నాను. సింగిల్ మైండెడ్ గా వర్క్ మీదే ఫోకస్ పెడుతూ వచ్చాను. కానీ.. అలా ఉండటం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. అలా ఉండటం వల్ల నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ని ఎంతో మిస్ అయ్యానని అనిపిస్తోంది. ఇకనైనా నా ఫ్యామిలీ, సన్నిహితులతో సమయం గడపాలని.. ఇదే సరైన సమయమని అనుకుంటున్నాను. వాళ్లతో లైఫ్ ని మరో కోణంలో చూడవచ్చు. కాబట్టి.. నటుడిగా మరో ఏడాదిన్నర కాలంపాటు కెమెరా ముందుకు రాకుండా బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో ఆమిర్ ఇంకా మాట్లాడుతూ.. “నేను ఏదైనా సినిమా చేసేటప్పుడు పూర్తిగా అందులోనే లీనమైపోతాను. సినిమా తప్ప వేరే విషయాలేవీ లేనట్లుగా దానిపైనే ధ్యాస పెడతాను. లాల్ సింగ్ చడ్డా మూవీ తర్వాత నేను ‘ఛాంపియన్స్’ మూవీ చేయాలి. అది అద్భుతమైన స్క్రిప్ట్.. అయినప్పటికీ నేను సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఛాంపియన్స్ సినిమాపై చాలా నమ్మకం ఉంది. బ్యూటిఫుల్ స్టోరీ అది. మనసులను కదిలించే భావోద్వేగం అందులో ఉంది. అన్నట్టు.. ఛాంపియన్స్ సినిమాను నేనే నిర్మించబోతున్నాను. నటనకు బ్రేకే గాని సినిమాలకు దూరంగా ఉంటానని కాదు” అని అన్నాడు. ప్రస్తుతం ఆమిర్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#AamirKhan will produce ‘Champions’, the actor confirms it while attending his childhood friend’s event in Delhi!*
The film will be co-produced by Aamir Khan Productions along with Sony Pictures International Productions, India, and 200NotOut Productions. pic.twitter.com/hE5DJUVGdR
— Amit Karn (@amitkarn99) November 14, 2022