లాల్ సింగ్ చడ్డా.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేర్లు. ఈ మూవీ పై అలాగే హీరో ఆమిర్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో పలువురు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ మిస్టర్ ఫర్ పెక్ట్ హీరో తాజాగా మరో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
లాల్ సింగ్ చడ్డా.. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం. టాలీవుడ్ హీరో నాగచైతన్య బలరాజుగా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఆమిర్ మీడియా వారికి క్షమాపణలు సైతం చెప్పారు.
ఈక్రమంలో లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ ను ఆమిర్ ఖాన్ తన భూజలపై వేసుకుని నడిపిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓటీటీకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీలు ఓటీటీలో త్వరగా రిలీజ్ చేయడంపై స్పందించాడు.. ”డబ్బులు ఎక్కువగా వస్తాయని మూవీలను నిర్మాతలు త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఇండస్ట్రీ మెుత్తం నష్టపోతుంది. ఇలాంటి తొందరపాటు పరిశ్రమకే ప్రమాదకరం. దీనిని అందరు గుర్తించాలి” అని ఆమిర్ ఖాన్ అన్నారు.
అయితే ఆమిర్ ఖాన్ తన లాల్ సింగ్ చడ్డా మూవీని 6నెలల తర్వతనే ఓటీటీకి ఇచ్చేటట్లు ఒప్పంద చేసుకున్నాడు. ఈక్రమంలో ఇప్పటికే తన సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ ఒకవైపు.. వ్యక్తిగత విమర్శలు మరోవైపు వస్తున్నా నేపథ్యంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశగా మారింది. మరి ఆమిర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.