కేజీఎఫ్ మూవీపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేసి వివాదాలలో నిలిచాడు దర్శకుడు వెంకటేష్ మహా. దీంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు. ఒక సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి గాని.. అలా బూతులు జోడించి విమర్శించడం సరైన పద్దతి కాదని చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై రీసెంట్ గా హీరో నాని కూడా రియాక్ట్ అవుతూ.. వెంకటేష్ మహా కామెంట్స్ పై కౌంటర్ వేశాడు. ఇదే క్రమంలో తాజాగా హీరో ఆది సాయికుమార్ రియాక్ట్ అయ్యాడు.
ఇటీవల కేజీఎఫ్ మూవీపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేసి వివాదాలలో నిలిచాడు దర్శకుడు వెంకటేష్ మహా. దీంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు. ఒక సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి గాని.. అలా బూతులు జోడించి విమర్శించడం సరైన పద్దతి కాదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలు నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలా.. జనాలలో స్ప్రెడ్ అయిపోయేసరికి.. వివాదంపై స్పందిస్తూ.. తాను బూతులు మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నానని, కానీ తన అభిప్రాయానికి అంతే కట్టుబడి ఉంటానని తేల్చేశాడు వెంకటేష్. ఏదో విధంగా బూతులు మాట్లాడినందుకు సారీ చెప్పడంతో ట్రోలర్స్ కాస్త వెనక్కి తగ్గారు.
ఇక్కడ బూతులు పక్కన పెడితే.. కేజీఎఫ్ గురించి అతను వెల్లడించిన అభిప్రాయం మాత్రం అతని వ్యక్తిగతం. ఇదిలా ఉండగా.. కన్నడ ఇండస్ట్రీకి ఆల్ టైమ్ క్రేజ్, బ్లాక్ బస్టర్ ని అందించిన కేజీఎఫ్ గురించి అంత దారుణంగా కామెంట్స్ చేస్తే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ముఖ్యంగా తెలుగులోనే ఆ సినిమాకి కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. వెంకటేష్ మాటలపై నేరుగా కాకపోయినా.. కొంతమంది తెలుగు సెలబ్రిటీలు సైతం అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై రీసెంట్ గా హీరో నాని కూడా రియాక్ట్ అవుతూ.. వెంకటేష్ మహా కామెంట్స్ పై కౌంటర్ వేశాడు. ఇదే క్రమంలో తాజాగా హీరో ఆది సాయికుమార్ రియాక్ట్ అయ్యాడు.
హీరో ఆది రియాక్ట్ అవుతూ.. “ఆ డైరెక్టర్ ఏమని కామెంట్ చేశాడో అది అతని పర్సనల్ ఒపీనియన్. కానీ.. నా వరకు వస్తే.. కేజీఎఫ్ అనేది కన్నడ ఇండస్ట్రీ హిట్. అది ట్రెండ్ సెట్టర్ మూవీ. అంతేగాక మూవీ కలెక్షన్స్. ఎంత చేసింది.. ఎంతమంది చూశారు? అక్కడే సమాధానం దొరికేసింది. కన్నడ వాళ్లకు అది బిగ్గెస్ట్. అది అందరికి నచ్చాలని రూల్ లేదు. కేజీఎఫ్ నచ్చలేదని చెబితే మాత్రాన అది ప్లాప్ అవ్వదు. అది చేయాల్సిన హవా చేసేసింది. సక్సెస్ అంత ఈజీ కాదు. అలాగంటే.. సక్సెస్ కొట్టేవన్ని కేజీఎఫ్ లు అయిపోవు కదా! సో.. దాని గురించి నేనేం కామెంట్ చేయదల్చుకోవట్లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ పై ఆది సాయికుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి కేజీఎఫ్ విషయంలో వెంకటేష్ మహా, ఆది సాయికుమార్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.