చిత్రపరిశ్రమలో మరో ప్రేమజంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది. హీరో ఆది పినిశెట్టి – హీరోయిన్ నిక్కీ గల్రాని మెడలో త్వరలోనే మూడు ముళ్ళు వేయనున్నాడు. గత కొన్నేళ్లుగా గాసిప్స్ లో లవర్స్ గా నిలిచిన ఆది – నిక్కీలు ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
తాజాగా ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానిల హల్దీ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. వీరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆది హల్దీ వేడుకలో నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ సందడి చేసిన దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆది – నిక్కీలతో కలిసి నాని, సందీప్ డాన్స్ చేశారు. ప్రస్తుతం హల్దీ సెలబ్రేషన్స్ వీడియో ట్రెండ్ అవుతోంది.ఇక మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆది – నిక్కీల పెళ్లిని మే 18న ఫిక్స్ చేసుకున్నారు. మరి ప్రస్తుతానికి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. మరికొద్ది గంటల్లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. కేవలం ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ సమక్షంలో ఆది – నిక్కీల పెళ్లి జరగబోతుంది. ఇదిలా ఉండగా.. తెలుగు ప్రేక్షకులకు ఆది గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
సీనియర్ స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది.. తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆది.. హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఆది – నిక్కీ ఇద్దరూ కలిసి రెండు చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆది – నిక్కీల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.