ఎక్కడ చూసినా RRR ఫీవర్ కనిపిస్తోంది. దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా థియేటర్ల వద్ద పండగ కొనసాగుతూనే ఉంది. సెలబ్రిటీలు మొదలు అగ్ర్ డైరెక్టర్ల వరకు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజమౌళి, రామ్ చరణ్, తారక్ పేర్లే వైరల్ అవుతున్నాయి. వాటన్నింటిలో ఓ బుడతడి వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఎంతో అమాయకంగా ఆ బుడ్డోడు అనే మాటలు అభిమానులను నవ్విస్తున్నాయి. సినిమా మధ్యలో పిల్లాడు ఏడవడం చూడగానే అందరికీ అయ్యో అనే ఫీలింగ్ వస్తోంది.
ఇదీ చదవండి: RRR సినిమాపై సుకుమార్ రియాక్షన్ వైరల్!
సినిమాలో మొదటి భాగంలోని ఓ సీన్లో రామ్ చరణ్ ను జూనియర్ ఎన్టీఆర్ కొడతాడు. ఆ సీన్ చూసిన రామ్ చరణ్ యంగ్ అభిమాని తట్టుకోలేక పోయాడు. ‘అసలు ఎన్టీఆర్.. రామ్ చరణ్ ను ఎలా కడొతాడు’ అంటూ ఏడ్చేశాడు. పక్కన ఉన్న వాళ్ల అమ్మను నిలదీశాడు. వాళ్లంతా ‘అదంతా సినిమాలోనే తర్వాత వాళ్లు ఫ్రెండ్స్ అయిపోతారు. నువ్వు ఏడవకు వాళ్లు మళ్లీ కలిసిపోతారు’ అంటూ సర్ది చెబుతుంది. మరి, ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Next Generation 🔥🔥🔥 pic.twitter.com/3rDhjA2LvG
— Anoop R V M (A+ve) (@RVMANTweetz) March 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.