ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ఇదివరకు వారానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే కరోనా కారణంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ నిలిచిపోయాయో.. ఆ తర్వాత నుండి ప్రతివారం నాలుగైదు సినిమాలు పోటీపడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలైతే రెండు వారాలు గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ.. మీడియం, చిన్న సినిమాల విషయానికి వచ్చేసరికి ఐదు సినిమాలకు మించి విడుదల అవుతుండటం గమనార్హం. ఇక నవంబర్ నెలలో తెలుగు సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో నాలుగైదు సినిమాలు పోటీపడటం చూశాం. ఈ క్రమంలో నవంబర్ మొదటి వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. గత కొన్ని నెలలుగా చూసుకుంటే.. సంఖ్య పరంగా ఒకేరోజు చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. అన్ని తెలుగు భాషలో తెరకెక్కినవి కాకపోగా.. డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే.. ఈ నవంబర్ 4న రిలీజ్ అవుతున్న తొమ్మిది సినిమాలు తెలుగు భాషలో రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో రెండు మూడు డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ, తెలుగులో అందుబాటులోకి వస్తున్నాయి.. కాబట్టి ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.
ఈ విధంగా చూస్తే.. మొత్తానికి నవంబర్ 4న తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి కనిపించబోతుంది. చిన్న పెద్ద అనే తేడాలేకుండా 9 సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది ఫ్యాన్స్ ని ఎక్ససైట్ చేసే విషయం. చూడాలి మరి ఎన్ని సినిమాలు నిలబడతాయో..!