Theatrical Releasing Movies: సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు వారానికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పడిందో.. అప్పటి నుండి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, వాయిదా పడిన సినిమాలు, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇలా అన్ని ఒకేసారిగా విడుదలకు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఇంతకుముందు ఒక పెద్ద సినిమాతో రెండు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, చిన్న సినిమాలు నాలుగైదు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల కారణంగా వాయిదా పడే సినిమాలు.. ఆల్రెడీ డేట్ ప్రకటించిన సినిమాలతో వచ్చేసరికి, ఒక్కసారిగా విడుదలకు నాలుగైదు సినిమాలకు పైగా వచ్చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం అంటే.. జూన్ 24న కేవలం స్ట్రయిట్ తెలుగు సినిమాలే 8 రిలీజ్ కాబోతున్నాయి.
మరి ఒక్కరోజే రిలీజ్ కానున్న ఆ ఎనిమిది సినిమాలేవో చూద్దాం!
1) సమ్మతమే
2) చోర్ బజార్
3) గ్యాంగ్ స్టర్ గంగరాజు
4) 7 డేస్ 6 నైట్స్
5) సదా నన్ను నడిపే
6) పెళ్లికూతురు పార్టీ
7) సాఫ్ట్ వేర్ బ్లూస్
8) కరణ్ అర్జున్
వీటికంటే ఒకరోజు ముందు అంటే జూన్ 23న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ సినిమా రిలీజ్ అవుతోంది. అలాగే బాలీవుడ్ నుండి ‘జుగ్ జుగ్ జియో’ సినిమా కూడా జూన్ 24న రిలీజ్ అవుతోంది. అంటే.. లెక్కన తెలుగు రాష్ట్రాలలోనే దాదాపు 10 సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతుండటం విశేషం. ఇక బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్న ఈ సినిమాలలో నిలబడేవి ఏవో.. పడిపోయేవి ఏవో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే. మరి ఒక్కరోజే రిలీజ్ అవుతున్న 8 తెలుగు సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Sammathame #GangsterGangaraju#ChorBazaar #7Days6Nights pic.twitter.com/iSlfJcbERE
— Aakashavaani (@TheAakashavaani) June 21, 2022