బిగ్ బాస్ ఫేమ్.. 7 ఆర్ట్స్ సరయు చుట్టూ ప్రస్తుతం ఓ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారని వస్తున్న వార్తలపై స్వయంగా సరయూనే స్పందించింది. అసలు కేసు ఏంటి? అది ఎప్పుడు మొదలైంది అనే క్లారిటీ ఇచ్చింది. అసలు ఇన్నాళ్లు ఎందుకు వెలుగులోకి రాలేదు అనే దానిపై కూడా స్పష్టతనిచ్చింది.
ఇదీ చదవండి: ఆస్కార్ నామినేషన్స్ లో “జైభీమ్” కి దక్కని స్థానం..
‘గతేడాది 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ కు చెందిన ఓ హోటల్ ను సిరిసిల్లలో ప్రారంభం చేసే సమయంలో.. గిప్పా నిస్తా అనే షార్ట్ ఫిల్మ్ చేశాం. హోటల్ ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి షూట్ చేశారు. అందులో గణపతి బప్పా మోరియా అని రిబ్బన్లు కట్టుకుని మద్యం సేవించే సీన్ ఉంది. దానిపై విశ్వ హిందూ పరిషత్ వారు అభ్యంతరం తెలిపారు. హోటల్ ప్రారంభించనివ్వం అని హెచ్చరించారు. వెంటనే ఆ సీన్ ఎడిట్ చేసి ఫిబ్రవరి 26న హోటల్ ప్రారంభించాం కూడా.
అక్కడితో ఆ ఇష్యూ సాటవుట్ అయ్యింది అనుకున్నాం. దానికి సంబంధించి నన్ను గానీ, మా డైరెక్టర్ ని గానీ ఎవరూ సంప్రదించలేదు. ఇప్పుడు ఆ కేసును హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేశారంట. నాకు పోస్టు వచ్చే వరకు కూడా ఆ విషయం తెలియదు. దానికి సంబంధించిన మాతో మాట్లాడటానికే స్టేషన్ పిలిచారు. వెళ్లి వివరణ ఇచ్చాం. ఒక హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిగా నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలి అనుకోలేదు. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా అందరికీ సారీ’ అంటూ సరయు జరిగిన ఘటనపై క్లారిటీ ఇస్తూనే ఎవరైనా హర్ట్ అయ్యే ఉంటే క్షమించండి అని సారీ కూడా చెప్పింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.