దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచనలు చేస్తుంటారు. టాలీవుడ్ లో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగిన నటీనటుల్ని చూస్తున్నాం. ఇక ఉత్తరాది హీరోయిన్లయితే చాలామంది నిర్మాణ రంగంలోకి దిగుతుంటారు, మరికొందరు బొటిక్ లు, ఇతర బిజినెస్ లతో కాలక్షేపం చేస్తుంటారు. లేటెస్ట్ గా గోవా బ్యూటీ ఇలియానా కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇకపై ఇదే తన ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఇలియానా. ఈ టైమ్ లోనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో సాగించిన ప్రేమాయణం ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. లాక్ డౌన్ తర్వాత చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. తన పేరుతోటే వీటిని మార్కెట్ చేసుకోవాలని చూస్తోంది. లవ్ లైఫ్ ఫెయిలైన తర్వాత చాన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లింది ఇలియానా. ఇన్ స్టా లో తన లవర్ ఆండ్రూ నీబోన్ ఫొటోలన్నీ డిలీట్ చేసింది. లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే సమయంలో సినిమా లైఫ్ ని కూడా పక్కనపెట్టిన ఇలియానా ఇప్పుడు కొత్త తరంతో పోటీ పడలేకపోతోంది. ఇటు ఆమెకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ లో ఉండి ఉంటే, కనీసం సీనియర్ హీరోలతో అయినా రిపీటెడ్ గా సినిమా అవకాశాలు వచ్చేవి. ఇప్పుడెలాగూ సమయం మించి పోయింది కాబట్టి తీరిగ్గా సైడ్ బిజినెస్ గురించి ఆలోచించి బేకరీ ప్లాన్ వేసింది ఇల్లీ బేబీ.
గోవా కేంద్రంగా ఇలియానా చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఉందట. కుటుంబ సభ్యుల సహకారంతో ఇలియానా ఈ చైన్ రెస్టారెంట్ల బిజినెస్ లోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ తర్వాతే తన సైడ్ బిజినెస్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుందట. అప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రచారం దంచికొట్టి ఒకేసారి గ్రాండ్ లాంఛ్ చేయాలనుకుంటోంది. ఆల్ ది బెస్ట్ ఇల్లీ!..