యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇటీవల ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. యువదర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కమల్ హాసన్ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు తాజాగా రూ. 300 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది విక్రమ్. ఈ సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు.
చాలాయేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టడంతో కమల్ పట్టలేని ఆనందంతో విక్రమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రబృందానికి ఖరీదైన బహుమతులు ఇచ్చిన కమల్.. ఇటీవల హైదరాబాద్ లో కూడా విక్రమ్ సక్సెస్ మీట్ నిర్వహించాడు. ఈ సక్సెస్ మీట్ అనంతరం నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు కమల్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా పాల్గొనడం విశేషం. ఇక విక్రమ్ విజయం సందర్భంగా విష్ చేస్తూ కమల్, లోకేష్ లను అభినందించాడు చిరు.
ఇదిలా ఉండగా.. తాజాగా కమల్ – చిరుకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది 1986లో కమల్ హాసన్.. స్వాతిముత్యం సినిమాకు గానూ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సమయంలో తీసిన ఫోటో అది. ఆ అవార్డు ప్రదాన కార్యక్రమంలో చిరు కూడా పాల్గొన్నారు. 36 ఏళ్ళ క్రితం చిరు – కమల్ కలిసి కనిపించిన పిక్.. ఇన్నేళ్ల తర్వాత బయటికి రావడం ఆనందంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
మరో విశేషం ఏంటంటే.. ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమాకు, 1986లో విడుదలైన విక్రమ్ సినిమాకు డైరెక్టర్ లోకేష్ లింక్ పెట్టిన విషయం విదితమే. అంటే.. అప్పుడు విక్రమ్ రిలీజైన ఏడాది.. ఇప్పుడు విక్రమ్ రిలీజైన టైమ్ ఒక్కటే కావడం, అప్పుడు చిరు – కమల్ మీటింగ్.. ఇప్పుడు చిరు – కమల్ మీటింగ్.. అందులోనూ యాదృచ్చికంగా 36 ఏళ్ళ తర్వాత.. ఒకే టైటిల్ తో విడుదలైన సినిమాల తర్వాత కలవడం ఎంతో బాగుందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి 36 ఏళ్ళ క్రిందటి చిరు – కమల్ త్రోబ్యాక్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
See how time flies! Megastar Chiranjeevi giving away shield to Kamal Haasan along with the Bollywood legend Raj Kapoor in 1986 for the classic Swathi Muthyam. Now megastar appreciating Kamal Haasan along with the Bollywood superstar in 2022 for #Vikram blockbuster! 👌 pic.twitter.com/OprwiGuRgY
— idlebrain.com (@idlebraindotcom) June 12, 2022