3 Years For Jersey Movie: అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. కొన్ని సినిమాలు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తే.. మరికొన్ని సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎడ్యుకేట్ చేస్తాయి.. మనలో స్పూర్తిని నింపుతాయి. అలాంటిదే నాని ప్రధాన పాత్రలో నటించిన ‘‘జెర్సీ’’ సినిమా. 30 ఏళ్ల వయసులో తన క్రికెట్ కలను నెరవేర్చుకోవటానికి కష్టపడే వ్యక్తి పాత్రలో ‘‘నాని’’ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా మొత్తం ఎమోషన్స్, సెంటిమెంట్స్‌తోనే నడుస్తుంది.
మంచి కథ, కథనంతో ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసి మెగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 19, 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంగళవారంతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమాలోని డిలేటెడ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి, ఆ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కాజల్ కొడుకు పేరును వెల్లడించిన చెల్లెలు నిషా అగర్వాల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.