ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అభిమాన హీరోలను చూడటానికి థియేటర్లకి పరిగెత్తే రోజులు వెళ్లిపోయాయి. హీరో హీరోయిన్స్ ఎవరైనా సినిమాలో కంటెంట్ ఏంటి? కొత్తదనం ఏంటనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక సినిమాలలో కంటెంట్ నే ప్రధానంగా చూస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాలు ఏ భాషలో తెరకెక్కినా ఇప్పుడున్న సోషల్ మీడియా, ఓటిటిల ద్వారా అన్ని భాషల ప్రేక్షకులను సినిమాలు చేరుతున్నాయి.
ఇక ఎన్నేళ్లు గడిచినా బిగ్ స్క్రీన్ పై సినిమా చూసి ఎంజాయ్ చేయడంలో ఉండే ఆనందమే వేరు. కొన్ని సినిమాలు ఎప్పుడైనా చూడొచ్చు అనిపిస్తుంది. మరికొన్ని సినిమాలు మిస్ అవ్వకుండా థియేటర్లో చూడాలని.. తీరా ఓటిటిలోకి వచ్చాక థియేటర్స్ లో చూసి ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలుగుతుంది. మరి అలాంటి సినిమాలు ప్రతీ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయా అని చెప్పలేం. కానీ.. రిలీజైన వాటిలో ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాల్సినవి ఉంటాయి. అయితే.. సోషల్ మీడియా లేకముందు ఏయే భాషల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలియదు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నవంబర్ 3వ వారం.. ఆంటే 18వ తేదీన ఒక్కరోజే దాదాపు 21 సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి.