ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తన సత్తా చాటింది. దానిలో ముఖ్యంగా సౌత్ సినిమాలు మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు 2022 సంవత్సరంలో అద్భుతంగా రాణించాయి. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు క్రేజ్ పెరిగేలా చేశాయి. పుష్ప, ట్రిపులార్, సీతారామం, మేజర్ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేశాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఫాలోవర్స్ లెక్కల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన హీరోలు ఎవరో మీకు తెలుసా? అయితే ఒకసారి ఈ ఆర్టికల్ పై లుక్ వేయండి.
టాలీవుడ్ లో రౌడీ హీరోగా ఎదిగాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విజయ్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే లైగర్ సినిమా రిజల్ట్ మాత్రం విజయ్ కెరీర్ పై గట్టిగానే ప్రభావం చూపింది. కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా మాత్రం విజయ్ కి ఎలాంటి ఢోకా లేదు. ఎంతో మంది సీనియర్ హీరోలను వెనక్కి నెట్టి విజయ్ దేవరకొండ 17.7 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కు ఇన్ స్టాగ్రామ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ వచ్చారు. డార్లింగ్ ప్రభాస్ కు ఇన్ స్టాగ్రామ్ లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి లేడీ ఫాలోవర్సే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ట్రిపులార్ సినిమాతో ఆ రేంజ్ ని మరింత పెంచుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ కు 10.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చరణ్ కెరీర్ లో ఈ సంఖ్య మరింత పైకి పాకే అవకాశం లేకపోలేదు.
సూపర్ స్టార్ మహేశ్ కు టాలీవుడ్ లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మహేశ్ కు ఇప్పటివరకు ఇన్ స్టాగ్రామ్ లో 9.4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మహేశ్ కు హీరోగానే కాకుండా వ్యక్తిగానూ చాలా మంది అభిమానులు ఉన్నారు. త్వరలోనే మహేశ్ బాబు- రాజమౌళితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేశ్ రేంజ్ కూడా ప్రపంచవ్యాప్తం కానుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
న్యాచురల్ స్టార్ నానికి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. నానికి సోషల్ మీడిాయాలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో నానికి 5.5 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. నిర్మాతగా కూడా నాని మంచి సక్సెస్ అందుకున్నాడు. హిట్ సిరీస్ తో ప్రొడ్యూసర్ గా లాభాలు అందుకున్నాడు. నెక్ట్స్ మూవీలో నాని కూడా హీరోగా కనిపంచనున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ బాగా ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, సోషల్ మీడియా విషయానికి వస్తే తారక్ ఫాలోయింగ్ తక్కువనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కు 5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ సంఖ్య బయట తారక్ కు ఉన్న అభిమానుల సంఖ్యకు అస్సలు మ్యాచ్ కాదు. తారక్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల, ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టులు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయంటూ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
రామ్ పోతినేనికి కెరీర్ బిగినింగ్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. సినిమాల పరంగానూ మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ, ఇప్పుడు రామ్ కు సరైన హిట్ దొరికి చాలాకాలం అయ్యింజి. వారియర్ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. ఇంక ఫాలోయింగ్ చూస్తే.. ఇన్ స్టాగ్రామ్ లో రామ్ పోతినేనికి 3.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ టాప్ 10 సోషల్ మీడియా ఫాలోవర్స్ లిస్ట్ లో మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. కెరీర్ లో భిన్నమైన స్టోరీలతో వరుణ్ మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మెగా హీరోగానే కాకుండా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ కు 2.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరో మెగా హోరీ సాయి ధరమ్ తేజ్ కి కూడా 2.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే అక్కినేని అఖిల్ కి కూడా ఇన్ స్టాగ్రామ్ లో 2.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.