2022.. అంగరంగ వైభవంగా సినీ రంగంలో అత్యున్నతమైన ఆస్కార్(అకాడమీ) అవార్డుల వేడుక మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ లో జరిగింది. ఇది 94వ ఆస్కార్ వేడుక కాగా.. హాలీవుడ్ సినిమాలతో పాటు ఇండియన్ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలవడం విశేషం. ఈసారి కూడా పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రం మొదలుకొని.. అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అవార్డులను అందుకున్నారు. మరి ఈ 94వ ఆస్కార్ అవార్డుల బరిలో విజేతలుగా నిలిచిన వారి లిస్ట్ ఇప్పుడు చూద్దాం!
*ఉత్తమ చిత్రం: కోడా(CODA)
*ఉత్తమ నటి: కోకా చాస్టెయిన్( ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ)
*ఉత్తమ నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్స్)
*ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
*ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్ (కోడా)
*ఉత్తమ సహాయ నటి: ఆరియానా డిబోస్ (వెస్ట్ నైడ్ స్టోరి)
*ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: కెన్నెత్ బ్రనాగ్ (బెల్‌ఫాస్ట్)
*ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బేవన్ (క్రయెల్లా)
*ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్)
*ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: డ్రైవ్ మై కార్ (జపాన్)
*ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: సియాన్ హెడర్ (కోడా)
*ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్ (నో టైమ్ టు డై)
*ఉత్తమ సౌండ్: మార్క్ మాంగినీ, థియో గ్రీన్, హెమ్‌ఫిల్, రాన్ బార్ట్‌లెట్ (డ్యూన్)
*ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది క్వీన్ ఆఫ్ బాక్సెట్‌బాల్
*ఉత్తమ షార్ట్(యానిమేటెడ్): విండ్ షీల్డ్ వైపర్
*ఉత్తమ షార్ట్ ఫిల్మ్(లైవ్ యాక్షన్): ది లాంగ్ గుడ్‌బై
*ఉత్తమ ఒరిజినల్ స్కోర్: డ్యూన్
*ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: డ్యూన్
*ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్: డ్యూన్
*ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలిష్ట్: ది ఐస్ ఆఫ్ ది టామీ సై
*ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్
*ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్): ది విండ్‌షేల్డ్ వైపర్
*ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ఇన్‌కాంటో