బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ చిత్రం RRR. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 25న వివిధ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ, ఒలీవియా మోరిస్, సముద్రఖని లాంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించారు. అయితే.. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న RRR మూవీని చూసేందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం!
1) రాజమౌళి:బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. రాజమౌళి RRR సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మాములు హీరోలనే సూపర్ హీరోలుగా చూపించే జక్కన్న.. సూపర్ హీరోలుగా పేరున్న ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి సినిమా తీస్తే ఏ రేంజిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. కాబట్టి RRR అనేది బిగ్గర్ థెన్ బాహుబలి అని ఈజీగా అర్థమవుతుంది.
2) ఎన్టీఆర్:
అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. దాదాపు 4 ఏళ్ల తర్వాత RRR వస్తోంది. అదీగాక డాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీలో మేటి అయిన ఎన్టీఆర్.. రాజమౌళి సినిమాలో కొమరం భీమ్ రోల్ చేశాడంటే.. తొక్కుకుంటూ పోయి థియేటర్లలో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ కి ఇంతకన్నా బెటర్ రీసన్ ఏముంటుంది.
3) రామ్ చరణ్:
మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది. అదీగాక చరణ్ ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అందులోనూ చరణ్ కిది మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మరి బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలు కొట్టడానికి మెగా ఫ్యాన్స్ కి ఇంతకన్నా ట్రీట్ ఏముంటుంది.
4) మల్టీస్టారర్:
పాన్ ఇండియా స్థాయిలో ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ అనేది సౌత్ ఇండస్ట్రీలోనే మొదటిసారి. అందులోనూ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రలతో సినిమా.. సినీ అభిమానులకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ అవసరం లేదు కదా!
5) పీరియాడిక్ స్టోరీ:
సాధారణంగా పాన్ ఇండియా స్థాయిలో సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, మాస్ కమర్షియల్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ పీరియాడిక్ నేపథ్యంలో మల్టీస్టారర్. అదికూడా చరిత్రలో నిలిచిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల కథ.. ఒకేసారి, ఒకే తెరపై చూడబోతున్నాం.. ఇంకేం కావాలి!
6) పాన్ ఇండియా క్రేజ్ కో-స్టార్స్:
ఈ సినిమాలో దాదాపు దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగిన తారలు నటించారు. హీరోయిన్స్ అలియా భట్, ఒలివియా మోరిస్ నుండి స్టార్స్ అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని లాంటి చాలామంది ఇండియన్ యాక్టర్స్ నటించడం విశేషం.
7) బ్రిటీష్ అరాచక పాలన:ఇప్పటివరకు ఇండియాలో బ్రిటిష్ పరిపాలన గురించి చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఫ్రీడమ్ రాకముందు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కాలంలో బ్రిటిష్ పాలన ఎలా ఉండేది అనేది ఈ సినిమాలో హైలైట్ కాబోతుంది. ట్రైలర్ లో చూపించిందంతా 1% మాత్రమే.. మిగతాదంతా తెరపై చూడాల్సిందే.
8) ఫ్రెండ్ షిప్ మ్యాజిక్:పాన్ ఇండియా సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించడమే కన్నుల పండుగలా ఉంటుంది. అలాంటిది ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్య స్నేహం అనేది కుదిరితే ఎలా ఉండబోతుంది.. అనేది రాజమౌళి మార్క్ లో చూడబోతున్నాం. ఆల్రెడీ RRR ట్రైలర్ లో చరణ్, ఎన్టీఆర్ సీన్స్ కనువిందు చేస్తున్నాయి.
9) రాజమౌళి మార్క్ యాక్షన్ సీక్వెన్స్:రాజమౌళి సినిమా అంటేనే.. క్లాస్, మాస్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇద్దరు బిగ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ చేస్తే సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. అదీగాక ప్రతి ఇంటర్వ్యూలో జక్కన్న.. సినిమాలో యాక్షన్, ఎమోషనల్ టచ్ పీక్స్ లో ఉంటాయని చెబుతూ వస్తున్నాడు. మరి ఇంతకన్నా మంచి రీసన్ ఏం కావాలి!
10) సంగీతం:రాజమౌళి సినిమాలు అన్నింటికీ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి సినిమాలో సాంగ్స్ ఒక ఎత్తయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉంటుంది. మరి సింగిల్ హీరో ఉన్న బాహుబలికే బిజీఎం ఆ స్థాయిలో ఉంటే.. ఇది మల్టీస్టారర్.. అందులోనూ ఎమోషనల్ కంటెంట్ బాగానే ఉందని చెబుతున్నారు. మరి ఈసారి కీరవాణి మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
11) ప్రొడక్షన్ డిజైన్, డాన్స్:
పీరియాడిక్ మూవీ కాబట్టి సినిమాలో బ్రిటిష్ కాలపు ఆర్ట్ వర్క్ చూడబోతున్నాం. అప్పటి యుద్ధ సామగ్రి, యుద్ధ నియమాలు, ఆ కాలపు మర్యాదలు, వాతావరణం ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యమైన విషయం డాన్స్. సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ డాన్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఉర్రూతలు ఊగిస్తోంది.
12) సినిమాటోగ్రఫీ:రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్.. బాహుబలి కంటే ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడ్డామని.. మల్టీస్టారర్ కాబట్టి సినిమాలో ఇద్దరు హీరోలకు కావాల్సిన యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి 15 నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుందని చెప్పారు. సో మాసివ్ సినిమాటోగ్రఫీని చూడటానికి అయినా RRR కి వెళ్లాల్సిందే.
13) బడ్జెట్, 4 ఏళ్ల కష్టం:రాజమౌళి సినిమా అంటే.. బాహుబలి తర్వాత అన్ని వందల కోట్లతోనే ముడిపడి ఉంటాయి. ఒకసారి పాన్ ఇండియా అడుగు వేశాక.. రాజమౌళితో సినిమా చేసే నిర్మాతలు ఎక్కడా కంప్రమైజ్ అవ్వకుండా వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. తీయడం లేటు కావచ్చేమో కాని.. బాక్సాఫీస్ దగ్గర డబుల్, ట్రిపుల్ కలెక్షన్స్ రాబట్టుకోవడం మాత్రం పక్కా.. సో నాలుగేళ్ళ కష్టాన్ని గుర్తించి అయినా RRR పై థియేటర్స్ లో ఓ లుక్కేయాల్సిందే.