OTT Movies: ఈ మధ్యకాలంలో జనాలపై ఓటిటిలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా బయటికి రాకుండా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా విడుదలైన నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటిటి సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 లాంటివి.. రిలీజ్ కి రెడీగా ఉన్న చిన్న, పెద్ద సినిమాల హక్కులను దక్కించుకొని రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. అయితే.. ఒకే వారంలో పదికి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడం ఇదివరకు చూశాం. కానీ.. ఒకేరోజు పదికి పైగా ఓటిటి రిలీజ్ అయితే.. అది మామూలు విషయం కాదు.
ఈ ఏడాది అత్యధికంగా ఓటిటి సినిమాలు విడుదలైన నెల జూన్ అనే చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. గతవారం(జూన్ 17న) ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు/సిరీస్ లు ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు జూన్ 24న ఒకేసారి 12 సినిమాలు/వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. అందులో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల డబ్బింగ్ రూపంలో సైతం మరికొన్ని తెలుగులో అందుబాటులోకి రానున్నాయి.
ఇక ఈ వారం(జూన్ 24న) అమెజాన్ ప్రైమ్ లో ఏ ఒక్క సినిమా/సిరీస్ రిలీజ్ లేకపోవడం గమనార్హం. మరి జూన్ 24న రిలీజ్ కానున్న 12 సినిమాలు/వెబ్ సిరీస్ లు ఏవేవో చూద్దాం!
ఆహా(aha):
మన్మథలీల(మూవీ)
నెట్ ఫ్లిక్స్(Netflix):
మనీహీస్ట్ – కొరియన్ సిరీస్ (సీజన్ 1)
కుట్టావుమ్ శిక్షయుమ్ – మలయాళం(మూవీ)
యాంగ్రీ బర్డ్స్ – ఇంగ్లీష్ (సిరీస్- సీజన్ 2)
మ్యాన్ v/s బీ – ఇంగ్లీష్ (సిరీస్ – సీజన్ 1)
ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో – ఇంగ్లీష్(మూవీ)
గ్లామర్ గర్ల్స్ – ఇంగ్లీష్ (మూవీ)
జీ5(Zee5):
పెళ్లి సందD – తెలుగు(మూవీ)
ఫోరెన్సిక్ – హిందీ(మూవీ)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
మేరీ ఆవాజ్ సునో – మలయాళం(మూవీ)
సోనీ లివ్(SonyLiv):
అవరోధ్ 2 – హిందీ (సిరీస్ – సీజన్ 2)
ఆహా (తమిళం):
కథిర్ – తమిళం (మూవీ)
ఇక ఒకేరోజు ఇన్ని సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతుండటంతో.. ఓటిటి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభించనుందని చెప్పవచ్చు. అలాగే ప్రముఖ ఓటిటి సంస్థలన్నీ సినిమాలు/సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న ఓటిటి సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
OTT Releases Tomorrow – 24th Jun pic.twitter.com/zUYOASp5Mb
— Aakashavaani (@TheAakashavaani) June 23, 2022