ఆడ, మగ మధ్య బంధం ఎల్లప్పుడూ ప్రేమ, పెళ్లి బంధమే కానక్కర్లేదు. అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహ బంధం కూడా ఉండొచ్చు. ఆ స్నేహం.. బెస్ట్ ఫ్రెండ్షిప్ కానక్కర్లేదు. ఓ సాధారణ స్నేహ బంధం కూడా అయి ఉండొచ్చు. బాగా పరిచయం ఉన్న వారు కూడా కావచ్చు. ఆ పరిచయం కాస్తా చాటింగ్ చేసే స్థాయికి ఎదగొచ్చు. అయితే, ఈ చాటింగ్ తర్వాత పాజిటివ్ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. కొన్ని రకాల మగాళ్లతో చాటింగ్ చేస్తే భవిష్యత్తులో నష్టపోక తప్పుదు. ఇలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుని వారితో జాగ్రత్తగా ఉండాలి. మెల్లమెల్లగా వారితో చాటింగ్ చేయటం మానుకోవాలి. ఈ కింది లక్షణాలు కలిగిన వారితో అమ్మాయిలు అస్సలు చాటింగ్ చేయోద్దు!
ఆధిక్యత చూపించే మగాళ్లు
ఇలాంటి మగాళ్లు ప్రతీ విషయంలో తమదే పైచెయ్యి అన్నట్లు ఫీలవుతూ ఉంటారు. పక్క వాళ్లు తమకన్నా కొంత ముందంజలో ఉన్నా సహించలేరు. అమ్మాయిలు ఇలాంటి వారితో చాటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వారికంటే గొప్పగా, ముందంజలో ఉన్నారని తెలిస్తే మీపై కుట్రలకు తెరతీస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది పురషాధిక్య సమాజం కాబట్టి చాలా విషయాల్లో స్త్రీలకు స్వేచ్ఛలేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిక్యత చూపే మగాళ్లతో చాటింగ్ అంత మంచిది కాదు.
కోపిష్టి మగాళ్లు
అర్జున్ రెడ్డి సినిమాలో హీరో లాంటి మగాళ్లు కేవలం వెండి తెరపై మాత్రమే బాగుంటారు. నిజ జీవితంలో వారితో స్నేహం, చాటింగ్ చాలా ఇబ్బందుల్ని కొని తెస్తుంది. మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. ప్రతీ విషయానికి వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారి కోపం వల్ల మీరు మానసిక ఆనందానికి దూరం అవుతూ ఉండాల్సి వస్తుంది.
కామంతో రంకెలేసే మగాళ్లు
సాధారణంగా ఆడవాళ్లతో పోల్చుకుంటే మగాళ్లకు ఎక్కువ శృంగార కోర్కెలు ఉంటాయి. అయితే, సాధారణ మగాళ్లలో ఉండేదాని కంటే ఎక్కువ కోర్కెలు ఉండే మగాళ్లతో డేంజర్ పొంచి ఉంది. వీరు కేవలం సెక్స్ కోసం మాత్రమే స్నేహం చేస్తారు. అమ్మాయిలతో మంచిగా మసలుకుంటారు. వీరి అంతిమ లక్ష్యం శృంగార అనుభవం పొందటమే..
బూతు పదాలు మాట్లాడేవారు
చాటింగ్ చేసే ప్రతి సారి బూతు పదాలు వాడే వారితో జాగ్రత్తగా ఉండాలి. వీరితో క్లోజ్ అయ్యే కొద్ది ఆడవారిపై కూడా బూతు పదాలు వాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెడతారు. చివరకు నేరుగా కలిసినపుడు కూడా బూతులు తిట్టే అవకాశం ఉంది.
రహస్యాలు బయటకు చెప్పే మగాళ్లు
ఉన్నది కొద్ది పరిచయమే అయినా కొంతమంది అందరితో తమకు సంబంధించిన విషయాలు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎవరితో పడితే వారితో చెప్పటం మంచిది కాదు. వారు మీ రహస్యాలను బయటకు చెప్పే అవకాశం ఉంది. మీ గురించి వేరే వాళ్లకు చెబుతున్నారని తెలియగానే వారిని దూరం పెట్టడం మంచిది. లేదంటే మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తారు.