హైదరాబాద్ :డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి కొంతమంది మెట్ఫార్మిన్ , మరికొంతమంది ఇన్సులిన్ వాడుతుంటారు. ఈ రెండింటిలో ఏ ఔషధం కరెక్ట్ గా పని చేస్తుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు…? డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలంటే చాలామంది డాక్టర్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ శాతం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ నే వాడాలని సూచిస్తుంటారు. ఈ టాబ్లెట్స్ ప్రతి షుగర్ వ్యాధిగ్రస్తుడు వాడకూడదు. ఎందుకంటే డయాబెటిక్ సమస్య ఉన్నవారిలో కిడ్నీ, లివర్ ఫెయిల్ అయినవాళ్లకు మెట్ఫార్మిన్ ను ఎక్కువగా సజెస్ట్ చేయరు. ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలున్నవారికి వీటిని సజెస్ట్ చేయరు. మెట్ఫార్మిన్ టాబ్లెట్ ను పరగడుపుతో వేసుకుంటే కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఏమీ తినకుండా మెట్ఫార్మిన్ టాబ్లెట్ వేసుకుంటే మరికొందరిలో గ్యాస్ తోపాటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కాబట్టి మెట్ఫార్మిన్ టాబ్లెట్ ను తప్పనిసరిగా ఫుడ్ తిన్న తర్వాతనే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. టైప్ -2 మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నట్లయితే డాక్టర్ మెట్‌ఫార్మిన్ టాబ్లేట్ నే వాడాలని సూచించడం జరుగుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో లేదా మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలోనే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడడానికి డాక్టర్ మెట్ ఫార్మిన్‌ని సూచించవచ్చు. మెట్‌ఫార్మిన్ వినియోగాన్నిఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ బరువు తగ్గించే మందుగా మెట్‌ఫార్మిన్‌ను ఆమోదించలేదు. బరువుతగ్గడంకోసం మెట్‌ఫార్మిన్‌ను ఎంత మోతాదులో వాడాలో వైద్యులు సూచిస్తారు. అంతేకాదు డోస్ సూచించే సమయంలో వారివారి సమస్య తీవ్రతను బట్టి సరైన మోతాదు తీసుకోమని చెబుతారు డాక్టర్.
కొంతమందికి మెట్‌ఫార్మిన్‌ను తక్కువ మోతాదులో ప్రారంభించి, కొన్ని వారాల తర్వాత క్రమంగా పెంచవచ్చు. ఒకవేళ ఏవైనా దుష్ప్రభావాలలువస్తే టాబ్లెట్ డోస్ తగ్గిస్తారు. బరువు తగ్గడమనేది ఒక వ్యక్తి కి మరొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. అయిన ప్పటికీ, వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేసే బరువు తగ్గించే పద్ధతి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మాత్రమే. మెట్‌ఫార్మిన్ తీసుకున్నా లేదా తీసుకోకపోయినా, వేగంగా బరువు కోల్పోతుంటే, ఆకలి లేకుంటే మీ వైద్యుడిని సంప్రదించాలి. వందమంది మెట్‌ఫార్మిన్ వాడితే ఇరవై మందిలో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మెట్‌ఫార్మిన్ అనేది ఎప్పుడూ షుగర్ లెవల్స్ ను డౌన్ చేయదు. కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాదు పీసీఓడీ తగ్గడానికి కూడా కొంతమంది డాక్టర్లు మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ నే వాడాలని సూచిస్తుంటారు.