శృంగారంలో భావప్రాప్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శృంగార అనుభవానికి భావప్రాప్తి కొలమానం. భావప్రాప్తి కలిగిన దాని బట్టే భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండటమా.. బలహీనం అవ్వటమా అన్నది డిసైడ్ అవుతుంది. కొంతమంది భార్యతో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే భావప్రాప్తి కలుగుతుందని భావిస్తుంటారు. కానీ, అందులో వాస్తవం లేదు. దీని గురించి ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం మాట్లాడుతూ.. ‘‘ శృంగారంలో ఎన్ని సార్లు పాల్గొనాలని లేదు. భార్య తృప్తి చెందడానికి మనసు కలగాలి. ఏ వ్యక్తితో అయితే ఆమె శృంగారంలో పాల్గొంటుందో.. భర్త కావచ్చు, సహజీవనం చేస్తున్న వ్యక్తి కావచ్చు.. ఆ మనిషి మీద క్రేజ్ ఉండాలి. ఆ మనిషితో శృంగారంలో పాల్గొనాలనే తహతహ ఉండాలి. ఆ తహతహ, కోరిక ఉన్నపుడు సెక్స్‌లో పాల్గొంటే.. రోజుకు మూడు సార్లు, నాలుగు సార్లు పాల్గొన్నా ఆమెకు భావప్రాప్తి కలుగుతుంది.
చెప్పలేనంత థ్రిల్ పొందుతుంది. ఒక వేళ రోజూ సెక్స్‌లో పాల్గొన్నప్పటికి వారానికో.. పది రోజులకో భావ ప్రాప్తి కలుగుతుంటే.. మనసు లేదని గుర్తించాలి. మనసు లేనపుడు మెకానికల్ శృంగారం అయిపోతుంది. ఏదో భర్త కోసం శృంగారంలో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇంటిమసీ ఉండాలి. ఒకరి కోసం ఒకరు అనిపించాలి. ఇంటిమసీ ఇద్దర్ని పెనవేసుకునేలా చేస్తాయి. ఎదుటి వ్యక్తి మీద ఇష్టం, ప్రేమ ఉన్నపుడు సెక్స్‌లో పాల్గొనటం వల్ల ఫీల్‌గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ విడుదల అవుతాయి. భర్త చెయ్యి వేయగానే భార్య ఒళ్లు పులకరిస్తుంది. మనసు పులకరిస్తుంది. ఎందుకంటే.. ఆ వ్యక్తితో స్పర్శ కోసం మనసు తహతహపడుతుంది. శృంగారం చేయాలని మనసు తహతహలాడుతుంది.
ఇలాంటి సమయంలో శరీరంలో డోపమైన్ రిలీజై మూడ్‌ను పెంచుతుంది. ఆక్సిటోసిన్ కారణంగా ఇద్దరూ ఒకటి అన్న భావన, శరీరాలు వేరైనా మనసులు ఒకటే అన్న భావన కలుగుతుంది. సెరటొనిన్ అనే మరో హార్మోన్ మూడ్‌ను ఎలివేట్ చేస్తుంది. డిప్రెషన్‌ను పోగొడుతుంది. ఎండార్ఫిన్స్ మూడ్‌ను పెంచి చక్కని థ్రిల్‌ను ఇస్తాయి. ఇవన్నీ మనసు పడ్డప్పుడు క్రేజీ ఉన్నపుడు వస్తాయి. ఆడవారి భావప్రాప్తి అనేది మనసుకు సంబంధించింది. భర్త నచ్చకపోతే నెల, సంవత్సరం శృంగారంలో పాల్గొన్నా భావ ప్రాప్తి కలగదు. భార్యను అవమానిస్తూ.. ఎప్పుడూ తిడుతూ ఉంటే భార్యకు ఎప్పుడూ భావప్రాప్తి కలగదు. భార్యా భర్తల మధ్య ఇంటిమసీ ఉంటే పదిసార్లు పాల్గొన్నా.. పదిసార్లు భావప్రాప్తి కలుగుతుంది’’ అని అన్నారు.