హైదరాబాద్ : రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే.. శరీరానికి కూడా కొలెస్ట్రాల్ అనేది కొంతమేర అవసరమే. ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎలాంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలో తెలుసుకుందాం..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరంలో కొలస్ట్రాల్ ఉండకూడదు. ఒకవేళ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉందంటే.. గుండెను కాపాడుకోవాలనే ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే శరీరంలో కొవ్వుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి. గుండెపోటు అనేది సీరియస్ అనడానికి కొలస్ట్రాల్ ని ముఖ్య కారణంగా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు కారణం గుండెపోటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో గుండెను కాపాడే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఎలాంటివి తినాలో తెలుసుకుందాం.. అవోకాడో.. దీనిని కూడా రెగ్యులర్ ఫుడ్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సూపర్ ఫుడ్ మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. పలురకాల వ్యాధులను దూరం చేస్తుంది. దీనిలో ఫ్యాటీ యాసిడ్ లతో పాటు విటమిన్ ఎ, బి, ఇ, ఫైబర్, మినరల్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. చక్కెర శాతం చాలా తక్కువగా కాబట్టి కొలస్ట్రాల్ ను కరిగించడానికి చాలా మంచిదని చెబుతున్నారు పోషకా హార నిపుణులు. యాపిల్: గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజుకో యాపిల్ తింటే మంచిదట. యాపిల్ తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
పప్పుధాన్యాలు… ప్రోటీన్ కోసం ఇవి చాలా మంచివి. అందుకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు పప్పుధాన్యాలు తినాలని సూచిస్తుంటారు డాక్టర్లు. పప్పుధాన్యాలు కొలెస్ట్రాల్ పెరగకుండా చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ఆకుకూరలు.. కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండాలంటే.. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో గుండె సంబంధిత సమస్యలు ఉంటే.. ఎక్కువగా మజ్జిగ, కానీ బార్లీ నీళ్లు కానీ తీసుకోవాలి. ఇవి తాగడంవల్ల డీహైడ్రేషన్ కి గురవ్వకుండా ఉండొచ్చు. ఎండాకాలంలో దాహం లేకున్నా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ లాంటి పళ్ళను ఎక్కువగా తినాలి