సామాన్యంగా ఇల్లు చూసి అంచనా వేయొచ్చు అని పెద్దలు అన్నట్లుగా.. నివాసముండే ఇల్లు ఎంత చక్కగా, శుభ్రంగా ఉంటే ఇంటికి చుట్టాలు పక్కాల రాకపోకలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చే అతిథులు ఫుడ్ కంటే ముందుగా ఇంట్లో వాతావరణం చూసి సంతృప్తి చెందే అంశాలు కొన్ని ఉంటాయి. మరి అంతలా అతిథులను ఆకర్షించే అంశాలు ఏంటో చూద్దాం!
1)ప్రవేశ ద్వారం:
ఎవరైనా ఇంటికి రాగానే ముందుగా ఇంటి ప్రవేశ ద్వారం వైపు చూస్తారు. కాబట్టి ప్రవేశద్వారం అందంగా ఉంచాలి. ముఖ్యంగా ద్వారం వద్ద పాదరక్షలు, బూట్లు ఉంచడానికి ఉంచవద్దు. వాటికోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించండి.
2) మ్యాట్:
అతిథులు ఇంట్లోకి రాగానే గమనించే వాటిలో ప్రవేశ ద్వారం వద్ద మ్యాట్ కూడా ఒకటి. తలుపు ముందు శుభ్రమైన మ్యాట్ లను ఉంచండి. అతిథులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి.
3) సువాసన:
ఇంట్లో నిల్వచేసిన వస్తువులు, కూరగాయలు ఉంచకండి. ఇంటిలో సువాసన కూడా మీ అతిథులను ఆకర్షించే అంశాలలో ప్రధానమైనది. రోజూ ఎలా ఉన్నా అతిథులు వచ్చేముందు ఇంట్లో ఏదైనా సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ వ్యాప్తి చేయవచ్చు.
4) ఇంటిశుభ్రత: అతిథులు ఇంటికి వస్తున్నారని తెలియగానే కొందరు ఇంటిని శుభ్రం చేస్తుంటారు. అతిథులు వచ్చినా రాకపోయినా ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.
6) ఫర్నిచర్: వచ్చే అతిథులు ఎప్పుడైనా రాగానే హాల్ లోనే కూర్చుంటారు. సాధారణంగా ఇళ్లలో సోఫాలు, కుర్చీలు ఉంటాయి. కాబట్టి సౌకర్యవంతంగా కూర్చునేలా ఎక్కువ స్థలం ఉంటే మంచిది.
7) డైనింగ్ టేబుల్, ప్లేట్లు: ఎప్పుడైనా వచ్చే అతిథులకు భోజనం వడ్డించే ప్లేట్స్ గాని, వారిని కూర్చోబెట్టే స్థలం గాని శుభ్రంగా ఉంచడం అవసరం. శుభ్రంగా లేని ప్రదేశంలో కూర్చోబెడితే చెడు అభిప్రాయం కలుగుతుంది.
ఇలా అతిథులు వస్తున్నారంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కీలకంగా నిలుస్తాయి. వాటిలో బాత్రూమ్ శుభ్రత, పెంపుడు జంతువులు ఉండే ప్రదేశము కూడా లిస్టులోకి వస్తాయి. కాబట్టి ఇల్లు చక్కబెట్టాకే చుట్టాలకు పిలుపునివ్వడం మంచిదని అంటుంటారు. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.