అలాంటి మగాడు దొరికితే.. బెడ్ పై ఆడవారు స్వర్గం చూపిస్తారు!
భార్యాభర్తల మధ్య బంధం అన్నది మిలటరీ బంకర్‌లా ఉండాలి. అలా ఉంటేనే ఎన్ని కష్టనష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఆ బంధం కూలిపోకుండా ఉంటుంది. వాస్తవానికి ఓ బంధం బలంగా ఉండటం అన్నది భార్యాభర్తల ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే వారి మధ్య ఎలాంటి పొరపచ్చాలు రావు. గొడవల విషయానికి వస్తే.. మనుషుల మధ‍్య గొడవలు జరగటం అన్నది సర్వ సాధారణ విషయం. భార్యాభర్తలు కూడా మనుషులు కాబట్టి గొడవలు పడటం జరుగుతూ ఉంటుంది. అయితే, గొడవల కారణంగా ఇద్దరి మధ్యా అర్థం చేసుకునే గుణం పెరగాలి కానీ, తగ్గకూడదు. ఇలా ప్రతీ విషయంలోనూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. శృంగారం విషయంలోనూ ఇదే థియరీ వర్తిస్తుంది.
కానీ, మగాళ్లు ఎక్కువగా తమ వైపు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. శృంగారాన్ని 5 నిమిషాల సుఖం అని మాత్రమే భావిస్తుంటారు. వీర్యం పోయిన తర్వాత వచ్చే భావప్రాప్తినే మహోన్నతమైన సుఖం అనుకుంటూ ఉంటారు. నిజానికి శృంగారం అనేది టూ వే ప్రాసెస్. ఆడమగ ఇద్దరూ అందులో సుఖాన్ని పొందగలగాలి. లేదంటే భవిష్యత్తులో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ల మనసును అర్థం చేసుకునే మగాడికే వారి జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శృంగారం సమయంలోనూ ఆడవాళ్ల నుంచి మంచి సహాకారం అందుతుంది.
భార్యలతో ఎలా ఉంటే మగాడు స్వర్గం చూడగలడు..
అందరు భార్యలు ఒకేలాంటి ప్రవర్తనను కలిగి ఉండరు. ఒక్కోరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి.. ఇప్పుడు చెప్పబోయే రూల్స్ ఆడవారి ప్రవర్తనను బట్టి మారుతూ ఉంటాయి. మగాడు ఆడవారి నుంచి పూర్తి సహాకారం పొందాలనుకుంటే.. వారి ద్వారా శృంగారంలో నిజమైన స్వర్గపు అనుభవాలు చూడాలంటే.. అంతా కాకపోయినా.. కొంతైనా ఆమె మనసును అర్థం చేసుకోవాలి. కేవలం శృంగారం సమయంలో మాత్రమే ఆమెను మంచిగా చూసుకోవటం కాదు.. మిగిలిన సమయాల్లో కూడా ఆమె మనసును నొప్పించే పని చేయకుండా మసలుకోవాలి. ఇక్కడ రొమాన్స్ అన్నది నిజమైన పాత్ర పోషిస్తుంది. రొమాన్స్ అంటే మీరనుకునేలాంటిది కాదు..
రొమాన్స్ అన్నది సెక్స్‌కు చాలా దూరంగా ఉండే ఓ అద్భుతమైన అనుభవం. మీ భార్యను ప్రేమగా పలకరించటం.. టీ చేసి పెడితే బాగుందని పొగడటం.. సెలవు దినాల్లో.. ప్రత్యేకమైన రోజుల్లో పనుల్లో ఆమెకు సహాయం చేయటం.. వీలైతే వంట చేసిపెట్టటం(వంట చేయటం వస్తే).. కౌగిలింత, ముద్దు ముచ్చట ఇలాంటి వన్నీ రొమాన్స్ కిందకే వస్తాయి. ఇవి జంట మధ్య ఓ బలమైన బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆడవాళ్లు ఎక్కువగా దీన్నే ఇష్టపడతారు. కేవలం ఇంటర్ కోర్స్ మాత్రమే జీవితం అనుకునే వాళ్లను పెద్దగా పట్టించుకోరు. మామూలు సమయాల్లో తమతో ప్రేమగా,లాలనగా ఉండే మగాళ్లకు శృంగార సమయంలో ఆడవాళ్లు పూర్తిగా లొంగిపోతారు. స్వర్గం చూపిస్తారు.