ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం. ముఖ్యంగా శృంగార జీవితం బాగోలేకపోవటం. దీని కారణంగా అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాంటి అక్రమ సంబంధాలను నివారించటానికి భార్యాభర్తలు కలిసి చర్చించుకోవటం ఒకటే మార్గమని కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో ఆమె తెలియజేశారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ భర్తలు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు అనేది ఇప్పటి మాట కాదు.. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే 1910లో మహిళలు తమ హక్కుల పోరాటం కోసం బయటకు రావటం మొదలుపెట్టారు.
అలా బయటకు రావటం మొదలుపెట్టాక.. చాలా మందితో కలిసి పని చేయటం.. తోటి మగవాళ్లతో సంబంధాలు పెట్టుకోవటం అప్పట్లోనే స్టార్ట్ అయింది. అప్పటికంటే ముందు రాజులు ఎక్కువ మంది భార్యలు ఉంటే గొప్పగా ఫీలయ్యేవారు. అసలు ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అన్నది పరిశీలిస్తే… నా దగ్గరికి వచ్చిన చాలా కేసుల్ని చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఓ సారి నా దగ్గరకి ఓ భార్యాభర్త వచ్చారు. ఇద్దరూ కూడా చాలా మంచి ఫ్యామిలీ.. ఇద్దరూ చదువుకున్నారు. చాలా చక్కగా సంపాదించుకుంటున్నారు. అంతా బాగుంది. కానీ, అతను అక్రమ సంబంధం పెట్టుకోవటం జరిగింది. ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా?.. అతడు అనుకున్న విధంగా అతడి భార్య శృంగారంలో ఉండలేకపోయేది.
ఆమె కుచించుకుపోయేది. భారతీయ సంస్కృతిలో ఎలా ఉంటుందంటే.. శృంగారం గురించి మాట్లాడాలంటే మహిళలు ఇష్టపడరు. అందుకే ఆయన ఏమి చెప్పినా కానీ, ఆవిడ స్పందించేది కాదు. రెస్పాండ్ అయ్యేది కాదు. అతడు ఏం మాట్లాడినా కూడా ఓ బండరాయి లాగా గాజు బొమ్మలాగా నిలబడిపోయేది. దాంతో మగాడికి ఏంటంటే.. స్పందన అనేది లేకపోవటంతో అతడు బయటకు వెళ్లి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం జరిగింది. కానీ, ఇది సిల్లీగా అనిపిస్తుంది. ఒకలేడీ అలా ఉందంటే.. ముఖ్యంగా చాలా మంది లేడీస్‌కు తెలీదు. అటు అమ్మ చెప్పదు.. ఇటు అత్త చెప్పదు. ఇటు భర్త కూడా చెప్పడండి. తర్వాతి క్రమంలో నేను ఆయనకు చెప్పాను. సార్ ఆ అమ్మాయికి ఏమీ తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పాను.
చాలా మంది భర్తలు ఏమనుకుంటారంటే.. నా భార్యకు చెబితే ఏమనుకుంటుందో అనే ఫీలింగ్.. తల్లిని అడిగితే.. అత్తను అడిగితే ఏమనుకుంటారో అన్న ఫీలింగ్. ఆ అమ్మాయి తన భర్తకు సహకరించటం మానేసింది. కాబట్టి అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా ఇంకొక కేసు చాలా సింపుల్‌గా.. సిల్లీగా అనిపిస్తుంది. అసలు భర్త దగ్గరకు వచ్చి డ్రెస్ తీస్తున్నా గానీ, ఆ అమ్మాయి ఇష్టపడేది కాదు. 3 ఏళ్లు, నాలుగేళ్లు అయిపోయింది. అసలు డ్రెస్ ముట్టుకుంటే ఇష్టపడేది కాదు. కానీ, శృంగారం పరంగా ఫ్రీగా ఉండేది. కానీ, జనరల్‌గా ఏంటంటే. లేడీ అయినా కానీ, జెంట్ అయినా కానీ, ఫిజికల్ అటాచ్‌మెంట్ ఉన్నపుడు దుస్తులు లేకుండా ఉంటే వాళ్లు ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. చాలా మంది లేడీస్‌కు తెలీదు.
కొంత మంది మగాళ్లు పెళ్లి చేసుకున్నాం.. అయిపోయింది కార్యం అన్న విధంగా ఆలోచిస్తారు. కానీ, ఈ ప్రపంచంలో అది ఒక నిమిషం మాత్రమే.. దాని కోసం మీరు ఎంత ఫ్రీగా ఉండగలిగితే.. మీ ఫ్యామిలీ కానివ్వండి.. మీ వర్క్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలా మందికి తెలీదు. అది చెప్పిన తర్వాత వాళ్ల మిస్సెస్‌కి.. అంటే.. అనకూడదు కానీ, ఆవిడ కూడా చదువుకున్న ఆవిడే.. అటు తండ్రిని, తల్లిని, ఎవర్ని అడిగినా కానీ, ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది. కానీ, చాలా మంది అంటారు. స్వాతి బుక్కులో చాలా మంది లేడీస్ చదివేవి అవే కదండి అని. వేరీ గుడ్ చదువుతారు అంతవరకే దాన్ని భర్తకు చెబితే ఏమనుకుంటాడో అని చెప్పరు. ఈ రెండో కేసులో భార్య డ్రెస్ విప్పనివ్వకపోవటంతోటి అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇవన్నీ ఎలా అనిపిస్తాయంటే సిల్లీగా అనిపిస్తాయి. ఇక్కడ మగాళ్లు ఏం చేస్తారంటే..
ఒక భార్యకు చెప్పాలంటే ఇష్టపడరు. ఒక భార్య ఆప్యాయంగా మాట్లాడుతుంది అంటే ఆ టైంలో వాళ్లు పట్టించుకోరు. అదేబయటి ఆడవాళ్లో చాలా చక్కగా,సిల్లీగా, చాలా సరదాగా, చాలా లౌలీగా మాట్లాడేస్తారు. కానీ, ఇక్కడ.. భార్య దగ్గరకు వచ్చే సరికి అబ్బ ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి. ఆ పని చేసుకుంటూ.. ఈ పని చేసుకుంటూ ఏం మాట్లాడతాది అన్న వేలో ఆలోచిస్తారు. బయటి ఆడవారితో ఎంత సేపు మాట్లాడినా హ్యాపీగా అనిపిస్తుంది. భార్య అలా మాట్లాడదు అన్న వేలో మగాళ్లు ఆలోచిస్తారు. మీకు సిల్లీగా అనిపించొచ్చు. అతడికేమో చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చక్కగా హోటల్స్‌కు వెళ్లాలని, మంచి మంచి ప్లేస్‌లకు వెళ్లాలని, అక్కడ భార్యతో ఎంజాయ్ చేయాలని అతడి కోరిక. కానీ, ఎక్కడికీ వచ్చేది కాదండి ఆవిడ. చదువుకుంది. లెక్షరర్‌గా జాబ్‌కూడా చేస్తోంది. చాలా బాగుంటుంది ఆవిడ, కానీ, భర్త ఎక్కడికి రమ్మన్నా వచ్చేది కాదు. ఎక్కడికన్నా సరదాగా వెళదాం రావే అంటే.. ఏయ్ నేను రాను అమ్మ ఏమనుకుంటుందో..
అత్త ఏమనుకుంటుందో అని వెళ్లేది కాదు. దీంతో అతడు ఫిక్స్ అయిపోయాడు. బయటి వాళ్లను తీసుకుని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. ఇంకో కేసులో ఓ భర్త భార్యకు ఎంతో చెప్పి చూశాడు. సరదాగా మాట్లాడవే.. సెక్సీగా మాట్లాడవే.. లవ్‌లీగా మాట్లాడవే అంటే అస్సలు మాట్లాడేది కాదు. దీంతో ఫిక్స్ అయిపోయాడు. బయటివాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. కానీ, ఆ క్షణం మాట్లాడేశాను.. ఎంజాయ్ చేశాను అని మగవాడు అనుకుంటాడు. దాన్ని మర్చిపోతాడు.. వదిలేస్తాడు. సైకాలజీ ప్రకారం లెజెండ్‌గా ఉన్న దర్టీ ఆలోచలని ఇష్టపడతారట. కానీ, ఇంట్లో ఆడవాళ్లు దాన్ని ఇష్టపడరు. దాంతో బయట అక్రమ సంబంధాలకు వెళ్లిపోతారు. భర్తలు పరాయి స్త్రీలతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే భార్యతో కూడా మాట్లాడటానికి ప్రయత్నించండి. భార్యతో ఎంత ఫ్రీగా మాట్లాడితే అంత మంచిది.
దేశంలోని స్త్రీలు శృంగారం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ, అది ఇప్పుడిప్పుడే వస్తోంది. దాన్ని భార్యతో చర్చించండి. ఎప్పుడన్నా ఫోన్ చేసి చక్కగా మాట్లాడండి.. సరదాగా మాట్లాడండి. అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి భార్యలో మార్పు వస్తుంది. ఆమె కూడా మాట్లాడటానికి ముందుకు వస్తుంది. ప్రేమలో ఉన్నపుడు గంటలు గంటలు మాట్లాడతారు.. పెళ్లయిన తర్వాత ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోరు. లవ్ అనేది మనసుకు సంబంధించింది.. ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొంతమంది భర్తలు ఉద్యోగం నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చి.. భార్య సరిగా లేదని బయటకు వెళ్లిపోతుంటారు. మీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నారో ఆమెకు చెప్పి చూడండి. ఆమెను పొగుడ్తూ చెప్పి చేయించుకోండి. కొంతకాలానికి మీకు నచ్చినట్లుగా మీ భార్య మారుతుంది. అంతకన్నా అద్భుతంగా ఉండగలుగుతుంది. భార్యాభర్తలకు మించిన స్నేహం, అనుంబంధం ఎక్కడా ఉండదు.
ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకుని భార్యతో ఈ విషయాలను డిస్కస్ చేయండి. భర్తకు ఏదైనా చెబితే అనుమానం వ్యక్తం చేస్తాడేమోనని కొంతమంది భార్యలు తమ సమస్యలను చెప్పలేకపోవచ్చు. అలా ఏమన్నా భార్య ఆలోచిస్తుందేమో చూడండి. చక్కటి జీవనానికి భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలి. సరదాగా ఉన్నపుడు బయటకు వెళ్లిపోండి. ఎప్పుడూ పిల్లలు, ఇళ్లేనా ఎంజాయ్ చేయటానికి భర్త రమ్మనపుడు వెళ్లండి. భర్తతో ఎలా ఉండాలో చాల బుక్స్ ఉన్నాయి. వాటిని చదవండి. లేదా వీడియోలు చూడండి. అలా కాదు అనుకున్నపుడు మీ భర్తనే అడగండి. అదేం తప్పుకాదు. భర్తకు నచ్చినట్లుగా.. భార్యకు నచ్చినట్లుగా ఉంటే అక్రమ సంబంధాలు తగ్గిపోతాయి. బెడ్ రూమ్ అనేది భార్యాభర్తలకు సంబంధించింది. అది అంత అందంగా అద్భుతంగా ఉంటే.. అంత అద్భుతంగా ముందుకు వెళ్లగలుగుతారు. అక్రమ సంబంధాలు ఉండవు. కాదు.. కుదరదు అనుకుంటే 200 సంవత్సరాలు దాటిని ఈ అక్రమ సంబంధాలు పెరుగుతాయని సైకాలజీ పరంగా చెబుతున్నారు. అందుకే మహిళలు భర్తలకు తగిన విధంగా ఉండాలి. అప్పుడు మగాడికంటే ఆడదే ఎంజాయ్ చేస్తుంది.