మనిషిగా పుట్టి ఓ వయసుకు రాగానే.. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరిలోనూ శృంగారపరమైన కోర్కెలు మొదలవుతాయి. కొంతమందిలో అవి అదుపు చేసుకునే స్థాయిలో ఉంటే మరికొంత మందిలో అవి కట్టలు తెంచుకుంటాయి. ఓ మనిషిలో శృంగార పరమైన కోర్కెలు రెచ్చిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. స్త్రీ సాంగత్యం లేని కొంతమంది కోర్కెలను అదుపు చేసుకోవటానికి వీడియోలను, హస్త ప్రయోగాలను ఆశ్రయిస్తుంటారు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొన్ని సార్లు వీడియోల కారణంగా సాధారణ జీవితం అస్తవ్యస్తం అవుతుంటుంది.
ప్రతి నిమిషం శృంగార కోర్కెలు వేధిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలతో సతమతం అవుతుంటారు. మరికొంతమందిలో వీడియోలు చూడకపోయినా ఆలోచనలు వేధిస్తుంటాయి. సాధారణ జీవితం గడపలేక, చేసే పనిపై దృష్టి పెట్టలేక నరకం అనుభవిస్తుంటారు. అలాంటి వారికి రమణ మహర్షి ఓ చక్కటి సలహా ఇచ్చారు. ఆ సలహాతో కామ ఆలోచనలతో సతమతం అయ్యేవారి జీవితం గాడిన పడుతుంది. చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు.
శ్రీ రమణ మహర్షి తన శిష్యుడు అన్నామలైకి ఇచ్చిన సలహా..
ఈ స్టోరీ శ్రీ రమణ మహర్షి జీవించిన కాలంలో జరిగింది. శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో అన్నామలై స్వామి అనే శిష్యుడు ఉండేవాడు. ఆయనకు తరచుగా కొన్ని శృంగారపరమైన ఆలోచనలు వస్తూ ఉండేవి. వాటిని ఆయన పక్కకు నెడుతూ ఉండేవాడు. ఇలాంటి సమయంలో ఓ సారి రమణ మహర్షి అన్నామలైని పిలిచాడు. ఆశ్రమంలో వీలైనన్ని భవనాలు నిర్మించాలని చెప్పాడు. అన్నామలై ఆ పనిలో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు భవనాలు నిర్మించటానికి ఆశ్రమంలోకి వచ్చారు. వారిలో చాలా అందమైన వారు కూడా ఉన్నారు.
అందమైన ఆడవాళ్లను చూడగానే అన్నామలైలో కోర్కెలు పెరిగిపోయాయి. దీంతో ఆ మహిళల్ని పనిలోంచి బయటకు పంపేశాడు. అయితే, రమణ మహర్షి పట్టుబట్టి వారిని పనిలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత అన్నామలై తన సమస్యను రమణ మహర్షికి చెప్పారు. సదరు మహిళల కారణంగా తనలో కోర్కెలు పుడుతున్నాయని అన్నాడు. స్త్రీ వాంఛనుంచి బయట పడటం ఎలాగో చెప్పమని కోరాడు. అన్నామలై కోర్కె విని రమణ మహర్షి నవ్వుకున్నారు. చాలా ఏళ్ల నుంచి మునులు, బుషులు దాని కోసమే అన్వేషిస్తున్నారని అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఓ రోజు ఓ అందమైన మహిళ రమణ మహర్షిని చూడటానికి ఆశ్రమానికి వచ్చింది. ఆమెను చూడగానే అన్నామలై ముగ్ధుడైపోయాడు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన రమణ మహర్షి అన్నామలైని పిలిచి బండ రాయిపై నిలబడమన్నాడు.
అన్నామలై వెళ్లి బండ రాయిపై నిలబడ్డాడు. రమణ మహర్షి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అది మిట్ట మధ్యాహ్నం కావటంతో ఎండ కారణంగా బండరాయి కాల సాగింది. దీంతో ఆయన కాళ్లు భగభగ మండసాగాయి. అప్పుడు ఆయన ఆలోచనలు మారాయి. కామ ఆలోచనల స్థానంలో నొప్పి ఆలోచనలు వచ్చి పడ్డాయి. ఇది గమనించిన ఆయన అన్నామలైని అక్కడినుంచి పంపేశారు. మరికొన్ని రోజుల తర్వాత మరోసారి అన్నామలైలో కోర్కెలు పుట్టాయి. ఇదే విషయాన్ని రమణ మహర్షితో చెప్పాడు. అందుకు రమణ మహర్షి.. ‘‘ నువ్వు ఎందుకు పాడు ఆలోచనలపై నీ దృష్టిని నిలుపుతున్నావు? నువ్వు ఎందుకు మెడిటేషన్ చేయకూడదు? మన ప్రమేయం లేకుండా వచ్చిన ఆలోచనలు మన ప్రమోయం లేకుండానే వెళ్లిపోవాలి. నువ్వంటే నువ్వు కాదు.. నీ బుర్ర కాదు.. నువ్వే’’ అని అన్నారు. తర్వాత మెడిటేషన్ కారణంగా అన్నామలైలో చాలా మార్పు వచ్చింది.