సామాన్య మధ్య తరగతి మనిషికి ప్రతి రూపాయి కూడా లెక్కే. సంపాదించే అరాకొర డబ్బులని, ఆచూతూచి ఖర్చు చేసుకోవడం అందరికీ అలవాటు. కానీ.., కరెంట్ బిల్ విషయంలో మాత్రం మన క్యాలిక్యులేషన్స్ అస్సలు పని చేయవు. నెల అంతా మనం పొదుపుగా పవర్ వాడుకున్నా బిల్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తుంటుంది. దీంతో.., బిల్ కట్టే సమయంలో తల పట్టుకోవడం సామాన్యుడి వంతు అవుతుంది. కానీ.., తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగానే ఇలా పవర్ బిల్ ఎక్కువ వస్తుందని మీకు తెలుసా? ఇలా పొరపాట్ల విషయంలో కాస్త అవగాహన పెంచుకుని.., జాగ్రత్త తీసుకుంటే కరెంటు బిల్ తక్కువ వస్తుంది. మరి ఆ జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మనలో చాలా మంది ఇప్పటికీ ఇళ్లలో పాత సీఎఫ్ఎల్ బల్బులు, ట్యూబ్ లైట్లను వాడుతుంటారు. ఇవి పవర్ ఎక్కువ లాగుతాయి. వీటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను వాడితే ఎంతో విద్యుత్ మనం ఆదా చేయవచ్చు. దీని ఫలితంగా కరెంట్ బిల్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.
2. ఫ్రిడ్జిలు, ఏసీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా ఈరోజుల్లో లైఫ్ లీడ్ చేయడం అంత తేలిక కాదు. కానీ.., మన పవర్ బిల్ ని అమాంతం పెంచేసేవి. కాబట్టి.., వీటిని పవర్ కన్‌జమ్‌షన్ రేటింగ్‌ను బట్టి వాటిని కొనాలి. ఎక్కువ రేటింగ్ ఉంటే ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. దీంతో బిల్లు అధికంగా రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి.., ఇలాంటి విద్యుత్ ఉపకరణాలను కొనే సమయంలోనే జాగ్రత్త వహించండి.
3. మనలో చాలా మంది చేసే తప్పు ఒకటుంది. ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, కంప్యూటర్స్, టీవీ వంటి విద్యుత్ ఉపకరణాలను వాడాక వాటిని ఆపడంలో నిర్లక్ష్యం వహిస్తుంటాము. దీని వల్ల నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి.. ఆయా ఉపకరణాలు వినియోగంలో లేని సమయంలో వాటిని ఆఫ్ చేయడం ఈరోజు నుండైనా అలవాటు చేసుకోండి.
4. మనలో ఏసీలను కొందరు కేవలం 17 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేసి రన్ చేస్తుంటారు. ఇలా చేస్తే పవర్ బిల్ వేలల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఏసీ ఎప్పుడైనా 24 డిగ్రీల వద్ద ఉంచాలి. దీంతో బిల్ సంవత్సరానికి ఎంత లేదన్నా రూ.4000 నుంచి రూ.6000 వరకు ఆదా చేసుకోవచ్చు.
5. విద్యుత్ ఉపకరణాలకు విడి విడిగా ఔట్ లెట్‌లు కాకుండా.., అన్నింటికీ కలిపి ఒకటే ఉండేలా ఎక్స్‌టెన్షన్ బాక్స్ లు లేదా పవర్ స్ట్రిప్‌లను వాడాలి. దీంతో వినియోగంలో లేని సమయంలో అన్నింటినీ ఒకేసారి సులభంగా ఆపేయవచ్చు.
6) ఇక పవర్ బిల్ వేసే సమయంలో యూనిట్ల ఆధారంగా బిల్ వేస్తారు. నిర్దిష్ట యూనిట్లు దాటితే అన్నిటికీ కలిపి క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ పెరుగుతూ పోతుంది. కాబట్టి.., మీ మీటర్ లో యూనిట్ల స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ.., పవర్ సేవ్ చేయండి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు బిల్ కచ్చితంగా ముందు నెల కన్నా చాలా తక్కువ వస్తుంది. కావాలంటే ఓ నెల రోజుల పాటు.. ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.