ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. చాలా మంది బరువు పెరిగి పోతున్నామని వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ తిండిని కంట్రోల్ చేసుకోలేరు. బరువు పెరగకుండా ఉండడానికి ‘వెయిట్ లాస్ డివైస్’ ని కనుగొన్నారు. అటువంటి వారికోసం ఈ డివైస్ బాగా పనికొస్తుంది. బరువు తగ్గడం కోసం సైంటిస్టులు ఒక వెయిట్ లాస్ డివైస్ ని కనుగొన్నారు. అది పళ్ళని క్లోజ్ చేసేస్తుంది. తినలేరు. కేవలం లిక్విడ్ మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ న్యూజిలాండ్ యూనివర్సిటీ రీసెర్చర్లు ఈ కొత్త డివైస్ తీసుకు వచ్చారు. ఇది ఇలా మూసేయడం వల్ల ఏమి తినడానికి వీలవదు. అయితే ఇది శ్వాస మరియు మాట్లాడడంని కట్టి పెట్టలేదు. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో మీడియాతో ఈ విషయాన్ని చెప్పింది. ఎవరైతే దీనిని ధరిస్తారో వాళ్ళ యొక్క నోటిని 2 మి.మీ. మాత్రమే తెరవగలరు. దీనిని చూసిన చాలామంది ట్విట్టర్ లో కామెంట్స్ ని చేశారు. ట్రోల్సూ చేస్తున్నారు.
ఎవరైతే సర్జరీ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగకరమని యూనివర్సిటీ రీసెర్చర్లు వివరించారు. అయితే సర్జరీకి ముందు కాస్త బరువు తగ్గాలని భావించేవాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. దీనిని పెట్టుకున్న రెండు నుండి మూడు వారాలకి మ్యాగ్నెట్స్ తెరుచుకుంటాయని అప్పుడు తొలగించ వచ్చని చెప్పింది. అయితే ఈ డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ ఉపయోగించడం వల్ల కొన్ని పదాలు పలకలేరు. అదే విధంగా డిస్ కంఫర్ట్ గా ఉంటుంది. ఒకరి నోరు మూసి వేయడం అన్ని సమస్యలకి సొల్యూషన్ కాదు అని విమర్శకులు అంటున్నారు.
Otago and UK researchers have developed a world-first weight-loss device to help fight the global obesity epidemic: an intra-oral device that restricts a person to a liquid diet. Read more: https://t.co/eLhXwipiqs pic.twitter.com/Of6v3uvVbX
— University of Otago (@otago) June 28, 2021