శృంగార అనుభవం అన్నది సమయాన్ని బట్టి మారుతుంటుంది. రాత్రి పూట శృంగార అనుభవం ఒకలా.. మధ్యాహ్నం ఒకలా.. ఉదయం పూట ఒకలాంటి అనుభవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట శృంగారంలో పాల్గొనటం అన్నది భార్యాభర్తలకు ఎంతో మంచి అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాదు! ఉదయం పూట భార్యాభర్తలు కలవటం వల్ల సంతృప్తిగా, సంతోషంగా కూడా ఉంటుంది. వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అది భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇక, ఉదయం పూట శృంగారంలో పాల్గొనటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
మీ మూడ్‌ను మరింత మంచిగా చేస్తుంది
ఉదయం పూట శృంగారంలో పాల్గొనటం వల్ల ఓ మంచి ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మన శరీరంలో ఎండార్పిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనల్ని సంతోషంగా ఉంచుతుంది. రోజు మొదలయ్యేది ఉదయంతోనే కాబట్టి.. ఉదయాన్ని సంతోషంగా మొదలుపెడితే.. ఆ రోజంతా సంతోషంగా ఉండొచ్చు.
భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది
సెక్స్ మన మూడ్‌ను మంచిగా ఉండేటట్లు చేస్తుంది. తద్వారా ఉదయం పూట శృంగారంలో పాల్గొనే జంట మధ్య ఏకాంతం పెరుగుతుంది. ఇద్దరూ కలిసి ఉండే, క్వాలిటీ సమయం దొరుకుతుంది. దాని వల్ల భార్యాభర్తల మధ్య బంధం ధ్రుడపడుతుంది. చీటికి మాటికి జరిగే గొడవలు, మనస్పర్థలు తగ్గుతాయి.
శృంగార సామర్థ్యంలో హెచ్చు
ఉదయం పూట తాజాగా లేస్తాం కాబట్టి, మనలో ఎంతో శక్తి ఉంటుంది. ఈ శక్తిని సెక్స్ కోసం వినియోగిస్తే మంచి ఫలితాలను రాబట్టొచ్చు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ సంతృప్తి పొందేలా శృంగారాన్ని చేయోచ్చు. సాధారణంగా రాత్రిళ్లు చేసే సెక్స్‌కు చాలా అడ్డంకులు వస్తాయి. దానికి తోడు పని ఒత్తిడి కారణంగా సెక్స్ సామర్థ్యం, ఆసక్తి తగ్గుతుంది. సరిగా సెక్స్‌లో పాల్గొనలేము. అందుకే ఉదయం శృంగారం చేస్తే ఆ బాధలేమీ ఉండవు. ఓ మంచి అనుభవాన్ని పొందవచ్చు.
ఉదయం పూట శృంగారంతో కలిగే మరిన్ని ప్రయోజనాలు :