శృంగారం అనే సబ్జెక్ట్ మహా సముద్రంలాంటిది. పెళ్లై మీకు పదేళ్లు అయినా కూడా ఆ మహాసముద్రంలో మీకు మహా అయితే ఒక దోసిడు అనుభవం వచ్చినట్లు. ఇక్కడ ఎవరూ నిపుణులు లేరు.. ఎవరూ పప్పుసుద్దలు లేరు. కానీ, ముందు మిమ్మల్ని మీరు నమ్మడం నేర్చుకోవాలి. ముఖ్యంగా తెలియని విషయాన్ని నిర్మొహమాటంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అనుమానం మీకు వచ్చినా మీ భాగస్వామికి వచ్చినా ముందు నివృతి చేసుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు అవసరమైతే వైద్యులను, నిపుణులను కలుసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అయితే దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న, అలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియని ఒక అంశాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శృంగార జీవితానికి సంబంధించి మీ భాగస్వామితో రతిలో పాల్గొనే సమయంలో మీకు సడెన్‌గా కొన్ని ఊహలు వస్తూ ఉంటాయి. మీరు సంభోగించే వ్యక్తిని కాకుండా మరో వ్యక్తి ఆ స్థానంలో ఊహించుకుంటూ ఉంటారు. వారితో మీరు శృంగారం చేస్తున్నట్లు భావిస్తూ అనుభూతి పొందుతూ ఉంటారు. అయితే తర్వాత తాము ఏదో తప్పు చేస్తున్నట్లు భావిస్తూ ఉంటారు. ఒకరిని పెళ్లాడి మరొకరితో అలా ఊహించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే మీరు దానిని ఏదో మహాపరాధంగా భావించకండి. మీరేమీ తప్పు చేయడం లేదు. శృంగార జీవితంలో అది చాలా సర్వసాధరణం అని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వైద్యులు కూడా ఆ పద్ధతిని రికమెండ్ చేస్తూ ఉంటారు.
అవును.. మీరు చదివింది కరెక్టే. కొన్ని ప్రత్యేక కేసుల్లో వైద్యులే అలాంటి విధానాన్ని సూచిస్తూ ఉంటారు. కొంతమంది ఇష్టంలేని పెళ్లిచేసుకుంటూ ఉంటారు. తర్వాత వారి జీవితంలో మారలేక, చేసుకున్న వారితో సంతోషంగా ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఇమాజినరీ శృంగారాన్ని సూచిస్తారు. అంటే చేసుకున్న వారిపై మీకు ఇంట్రస్ట్ లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తి, లేదా హీరోయిన్ ఇలా ఎవరో ఒకరిని ఊహించుకుని రతిలో పాల్గొనమని చెబుతారు. ఈ విషయంలో ఒక్క మగాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా ఇలాంటి ఇమాజినరీ శృంగారం చేస్తుంటారు. ఒక సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 1300 మందిని సర్వే చేయగా.. 46 శాతం మంది ఆడవాళ్లు, 42 శాతం మంది మగాళ్లు ఈ ఫాంటసీ సె*క్స్ చేస్తున్నట్లు వెల్లడైంది.
కొన్ని కేసుల్లో ఆడవాళ్లకు కూడా వైద్యులు ఈ ఇమాజినరీ విధానాన్ని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ఆడవాళ్లకు ఆర్గాసమ్ అయ్యే అవకాశం లేదు. వాళ్లు భగాస్వామితో శృంగారాన్ని ఫీలవ్వలేరు. అప్పుడు వారికి నచ్చిన వారిని ఊహించుకుని ఆ అనుభూతిని పొందాలని సూచిస్తారు. చాలా సందర్భాల్లో ఈ ఊహాజనిత సె*క్స్ తప్పుకాదు. మీకు ఈరోజు బస్‌లో ఒక అమ్మాయి కనిపించింది, సినిమాలో ఒక హీరోయిన్‌ని చూశారు, ఆఫీస్‌లో ఒకరు అందంగా కనిపించారు. అలాంటి వారు మీకు శృంగారం సమయంలో మీ మైండ్‌లోకి రావడం తప్పేమీ కాదు. మీకు నచ్చిన వారితో శృంగారం చేసే అవకాశం ఉండదు.. అలా చేయడం తప్పు కూడా.. కాబట్టి మీ భాగస్వామితో శృంగారం చేస్తున్న సమయంలో వారిని ఊహించుకోవడం తప్పేమీ కాదని చెబుతున్నారు.
అయితే ఇది ఎప్పటివరకు సురక్షితం అంటే ఈరోజు ఉదయం చూసిన వారు రాత్రికి మీ ఫాంటసీ శృంగారంలో భాగం కావడం తప్పులేదు. కానీ, మీ ఎక్స్ లవర్, కాలేజీలో మీరు ప్రేమించిన అమ్మాయిని భాగస్వామితో శృంగారం చేస్తూ ఊహించుకోవడం మాత్రం ప్రమాదం అని చెబుతున్నారు. ఒకటి రెండుసార్లు అలా జరగితే తప్పులేదు. కానీ, ప్రతిసారి వారినే ఊహించుకుంటూ మీరు భాగస్వామితో సె*క్స్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీ భాగస్వామి మీద మీకు ఇంట్రస్ట్ తగ్గిపోతుంది. శృంగారం అనేది పార్టనర్‌తో బాండింగ్ పెరగడానికి చేసేది. అయితే ఇలా ఎక్స్ ని ఊహించుకోవడం వల్ల ఆ బాడింగ్ దెబ్బతింటుంది. అది మితిమీరి పోతుంటే నిపుణులను కలవడం మంచిది. లేదా మీ సమస్యలను భాగస్వామితో చర్చించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలి.