కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవ జీవితాన్ని, జీవన క్రమాన్ని పూర్తిగా మార్చేసింది. దీంతో.., ఇప్పుడు అంతా ఇమ్యూనిటీ బూస్టర్స్ పై ద్రుష్టి పెట్టారు. ఇక థర్డ్ వేవ్ రావడం పక్కా అని ఇప్పటికే కొంత మంది తేల్చి చెప్తున్నారు. ఈ నేపధ్యంలో పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెంచడం చాలా ముఖ్యం. మరి.. ఇందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
1) చిన్న పిల్లలని రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒక ఏడాది లోపు పిల్లలు ఒక వర్గం. 2 నుండి 8 ఏళ్ళ లోపు పిల్లలు ఒక వర్గం. ఏడాది వయసు లోపు పిల్లలకి అమ్మ పాలకి మించిన ఆహారం లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి అతి గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్. ఎలాగో ఈ వయసు పిల్లలు ఎక్కువగా నిద్రపోతారు కాబట్టి వీరికి కావాల్సినన్ని తల్లిపాలు అందిస్తే సరిపోద్ది.
2) ఇక రెండు నుండి 8 ఏళ్ళ లోపు పిల్లలకి సరైన ఆహారాన్ని అందించడమే ఓ పెద్ద టాస్క్. ఈ వయసు పిల్లలు ఆహారాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పెడుతుంటారు. ఈ సమయంలో వారికి ఇష్టమైన ఆహారాన్ని వేరే రూపంలో ఇవ్వడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి టిఫిన్ చేయడానికి ఇష్టపడకపోతే.., అందులో వారు ఇష్టంగా తినే పదార్ధాలను మిక్స్ చేయండి. ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ మూడు పూటలా తగిన ఫుడ్ అందించాలి.
3) ఈ వయసు పిల్లలు కూల్ డ్రింక్స్ కి చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని పొరపాటున కూడా వారికి సాఫ్ట్ డ్రింక్స్ తాపించకండి. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తద్వారా కార్బోహైడ్రేడ్స్ ఎక్కువ ఇచ్చినట్టు అవుతుంది.
4) పిల్లలు రోజులో 5 గ్రామాల కన్నా ఎక్కువగా సాల్ట్ అస్సలు టేస్ట్ చేయకూడదు. కావాలంటే వారి కోసం కూరలు విడిగా చేసి పెట్టుకోండి.
5) ఇక పిల్లలకి అధికంగా ఇవ్వాలసింది పండ్లు, కూరగాయలు. ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకండి. వీటితో పాటు.., ఎవరి ఆర్ధిక స్థోమతని బట్టి వారు.. కొన్ని డ్రై ఫ్రూప్ట్స్ అందించడం కూడా అవసరమే.
6) ఇక ఈ వయసు పిల్లలు వాటర్ తక్కువగా తాగుతుంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా శ్రద్ద వహించాలి. విడతల వారీగా పిల్లలకి నీళ్లు తాపించడం అలవాటు చేసుకోండి.
7) ఇక నిద్ర. పిల్లలు ఎంత ఎక్కువ సమయం నిద్రపోతే వారికి అంత మంచిది. కనీసం రోజులో 10 నుండి 12 గంటల నిద్ర వీరికి అవసరం ఈ విషయంలో కూడా పేరెంట్స్ జాగత్త వహించండి.