ప్రపంచంలో కొత్త ట్రెండ్స్ క్రియేట్ అవుతున్నాయి. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్సులు ఫేస్‌బుక్‌లో చాటింగులతో గడిపేస్తూ స్టార్ అయిపోతానంటూ భార్య వేస్తున్న వేషాలు చూడలేక భర్త నలిగిపోయాడు. సోషల్ మీడియాకు బానిసగా మారిన ప్రియాంక నిత్యం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో బిజీగా గడిపేది. డ్యాన్సులు, యాక్టింగ్ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది. ఎంత చెప్పినా భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో తనలో తానే చిద్రవధ అనుభవించిన భర్త పవన్ చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న అత్యంత విషాద ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌కి చెందిన పవన్ నీమ్‌కర్కి ఆరేళ్ల కిందట 2015లో మౌలాలికి చెందిన ప్రియాంకతో వివాహమైంది. కొద్దికాలం కాపురం సాఫీగానే సాగినా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. పెళ్లై ఆరేళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో గొడవలు ముదిరాయి. బంధువులు మృతుడి భార్య ప్రియాంకపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె వేధింపులు భరించలేకనే పవన్ ఆత్మహత్య చేసు కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటికి తోడు ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, ఆమె ఫొటోలు వైరల్‌గా మారాయి.