భార్యాభర్తల మధ్య సంబంధం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మానసిక సంబంధం.. రెండోది శారీరక సంబంధం. భార్యాభర్తల మధ్య మానసిక సంబంధం బలపడటానికి దోహద పడే అత్యంత ప్రధానమైన మార్గం శృంగారం. శృంగారం ద్వారానే ‘మేము ఇద్దరం కాదు ఒక్కటే’ అన్న భావన కలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే శృంగారం అనేది ప్రేమను వ్యక్త పరిచే ఓ అద్భుతమైన మార్గం. అయితే, శృంగారంలో ఆనందం అనేది టూ వేసే ప్రాసెస్‌గా ఉండాలి. దాని ద్వారా ఇద్దరూ భావప్రాప్తి పొందగలిగితేనే స్వర్గం కనిపిస్తుంది. శృంగారంలో భావప్రాప్తే కీలక ఘట్టం. ఆనందానికి ఇది ఓ సూచన.
మగవాళ్లు వీర్యాన్ని పోగొట్టుకున్న వెంటనే భావప్రాప్తి పొందుతారు. కానీ, ఆడ వాళ్ల విషయంలో అలా కాదు. వారిలో భావప్రాప్తి కలగాలంటే హార్డ్ వర్క్ కంటే.. స్మార్ట్ వర్క్ ఎంతో ముఖ్యం. ఆ విషయం తెలియక చాలా మంది మగాళ్లు కష్టపడి పోతుంటారు. అయినా ఆడవాళ్లు తమతో శృంగారం కారణంగా సుఖపడుతున్నారా? లేదా ? అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోరు. ఇలా అయితే.. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి.. మీ పార్ట్‌నర్ మీతో శృంగారంలో భావప్రాప్తి పొందుతున్నారో లేదో ఇలా తెలుసుకోండి.
గమనిక : అందరు ఆడవాళ్లు శృంగారం విషయంలో ఒకే విధంగా ఉండాలన్న రూలేమీ లేదు. ఒక్కోరికి ఒక్కోరకమైన శృంగార ఆలోచనలు ఉంటాయి. ఒక్కోరు ఒక్కోరకంగా భావప్రాప్తి పొందుతారు. శృంగారం విషయంలో మీ పార్ట్‌నర్ తృప్తి పొందటం లేదని మీకు అనిపిస్తే ఆమెతో దీని గురించి మట్లాడండి. శృంగార పరంగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువవుతుంటే.. సమస్యను బట్టి గైనకాలజిస్టును కానీ, సెక్సాలజిస్టును కానీ, కలవటం మంచింది.