భార్యాభర్తల మధ్య బంధాన్ని బలపరిచే వాటిలో శృంగారం అన్నది ప్రధానమైన అంశం. మంచి కలయిక ద్వారా ఇద్దరిలో నూతన ఉత్తేజం కలుగుతుంది. మానసికంగా, శారీరకంగా ఇద్దరూ దృఢంగా తయారు అవుతారు. అయితే, శృంగారం భార్యాభర్తల జీవితంలో ఓ సాధారణ విషయమే కావచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో శృంగారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. భార్యాభర్తలు శృంగారానికి దూరంగా ఉండాల్సిన సమయాలు ఏవంటే..
1) గొడవలు పడ్డప్పుడు
కొంతమంది భార్యాభర్తలు గొడవలు పడ్డప్పుడు కూడా శృంగారం చేయటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా చేస్తే ఇద్దరి మధ్యా గొడవలు సద్దుమణుగుతాయని భావిస్తుంటారు. కానీ, అలా అస్సలు జరగదు. కొన్ని సమయాల్లో ఇది ఎమోషనల్ ఫ్రస్టేషన్‌కు దారి తీసే అవకాశం ఉంది. ఒక వేళ ఇద్దరూ శృంగారానికి ఆసక్తి చూపించినా అది అర్థంలేని విషయమే అవుతుంది.
2) మద్యం మత్తులో ఉన్నపుడు
మద్యం మత్తులో ఉన్నపుడు కూడా శృంగారం చేయకూడదు. ముఖ్యంగా మగవారు. మద్యం మత్తులో ఉన్నపుడు ఎరెక్షన్‌కు సంబంధించిన సమస్యలు వస్తాయి. దానికి తోడు శృంగారాన్ని అనుభవించటంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. మద్యం తాగిన తర్వాత ప్రవర్తనలో మార్పు వస్తే.. అది ఇద్దరి మధ్యా గొడవలకు కూడా దారి తీయవచ్చు.
3) గర్భం సమయంలో..
సాధారణంగా గర్భం సమయంలో శృంగారం చేయటం సురక్షితమే. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఇది ఇబ్బందులకు దారి తీస్తుంది. భార్య గర్భంతో ఉన్నపుడు శృంగారం చేయాలనుకునేవారు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది. లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి.
4) డెలివరీ అయిన వెంటనే..
బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే శృంగారంలో పాల్గొనటం మంచిది కాదు. ఇందుకోసం కొంత సమయం వేచి ఉండాలి. కనీసం 4నుంచి 6 వారాలు గ్యాప్ ఇచ్చి.. తర్వాత శృంగారంలో పాల్గొంటే మంచిది. డెలివరీ అయిన వెంటనే శృంగారంలో పాల్గొంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
5) ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ ఉన్నపుడు
ఆడవారిలో ఈ ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఫంగల్ ఇన్‌ఫెక్షన్. దీని వల్ల స్త్రీ యొక్క మర్మ భాగంలో దురద, నొప్పి, డిశ్చార్జ్ వంటివి అవుతుంటాయి. ఇలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే అవి మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. భాగస్వామిని కూడా ఈ ఇన్‌ఫెక్షన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.