చలికాలం తీవ్రత రాను రాను పెరిగిపోతోంది. సాయంత్రం 5 దాటిన తర్వాత వాతావరణం బాగా తలిగా మారుతోంది. అలాగే ఉదయం 7 గంటల వరకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. అయితే చలికాలంలో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శారీరకంగానే కాకుండా ఇంట్లోనూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వంటగదిలో అన్ని ద్రవరూప వస్తువులు గడ్డ కట్టిపోతూ ఉంటాయి. నూనె, నెయ్యి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సిలిండర్ లోని గ్యాస్ కూడా గడ్డ కడుతుందని మీకు తెలుసా? అలా గడ్డకట్టడం వల్ల సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే మరి అలా చేయకుండా ఏం చేయాలి? ఎలా ఆ ఇబ్బందిని ఎదుర్కోవాలో తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గ్యాస్‌ని వృథా చేసుకోవాలి అని ఎవరూ అనుకోరు. అందుకే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి. సిలిండర్‌ని మనం ఫ్లోర్ మీద పెడుతూ ఉంటాం. సాధారణంగా అందరి ఇళ్లలో ఇప్పుడు టైల్స్ వచ్చేశాయి. వంటగదిలో కూడా అవే ఉంటున్నాయి. అవి చాలా త్వరగా చలిని గ్రహిస్తాయి. వేగంగా చల్లగా మారిపోతాయి. ఆ చలిని ఇనుముతో చేయబడిన సిలిండర్ త్వరగా గ్రహిస్తుంది. అప్పుడు సిలిండర్‌లో ఉండే గ్యాస్ గడ్డకడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు సిలిండర్ వీల్‌ని ఉపయోగిస్తే బావుంటుంది. అది సిలిండర్ ఫ్లోర్ మీద ఉండకుండా చేస్తుంది కాబట్టి గ్యాస్ గడ్డకట్ట కుండా ఉండే అవకాశం ఉంది.
అలాగే గ్యాస్ సిలిండర్ వేగంగా చల్లగా అవ్వకుండా ఉండాలి అంటే దానిని గన్నీ బ్యాగ్(జూటు గోతం)ని తగిలించండి. గోతాన్ని సిలిండర్‌పై కప్పడం వల్ల అది త్వరగా చల్లబడకుండా ఆపచ్చు. అలాగే గోతాంలో సిలిండర్‌ని దిగేస్తే కూడా గ్యాస్ సిలిండర్ చల్లగా అవ్వకుండా ఆపేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల మీకు గ్యాస్ గడ్డకట్టడం, వృథా కావడం కాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు గ్యాస్ గడ్డకట్టింది అనే అనుమానం గనుక వచ్చింది అనుకుంటే.. సింపుల్ ట్రిక్‌ని ఫాలోకండి. మీరు సాధారణంగా హోటళ్ల దగ్గర చూసే ఉంటారు. గ్యాస్ సిలిండర్‌ని ఓ వేడినీళ్ల గిన్నెల పెట్టి ఉంచుతారు. అలాగే మీరు కూడా ఇంట్లో ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో 3 నుంచి 4 లీటర్ల వేడినీళ్లు పోసి సిలిండర్‌ని దానిలో పెట్టేయండి. అలాచేస్తే ఒకవేళ సిలిండర్‌లో గ్యాస్ గడ్డకట్టి ఉంటి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ చిట్కాలతో చలికాలంలో గ్యాస్‌ని వృథా కాకుండా కాపాడుకోండి.