కారణాలు ఏవైనా కావచ్చు.. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయిపోయాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు కూడా పెరిగిపోయాయి. పెళ్లయిన తర్వాత మొదలయ్యేవి కొన్ని ఎఫైర్‌లు అయితే.. పెళ్లి తర్వాత కూడా కొనసాగేవి మరికొన్ని ఎఫైర్లు. వీటి కారణంగా కొన్ని సార్లు మానవత్వం నశించే పనులు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది తమ భాగస్వాములను చంపేస్తున్నారు. ఇందులో ఎక్కువ కేసులు ఆడవారి వైపునుంచివే కావటం విచారకరం. నిత్యం వార్తలో వస్తున్న వివాహేతర సంబంధాల న్యూస్ చదివి భర్తల గుండె కొట్టుకుంటూ ఉంటుంది. భార్యలు చేసే చిన్న పనిని కూడా వారు అనుమానించాల్సి వస్తుంది. భార్యలు చేసే ప్రతీ పనిని తప్పుడు ఉద్ధేశ్యంతో చూస్తూ ఉంటారు.
అయితే, దీని వల్ల మంచి భార్యలను కూడా భర్తలు అనుమానించటం జరుగుతుంటుంది. ఇది మొదటికే మోసం తెస్తుంది. బంగారం లాంటి కాపురం కూలి పోతుంది. భార్యను అనుమానించి, వేధించి దూరం చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆమెకు నిజంగా ఎఫైర్ ఉందా ?లేదా? అన్నది తెలుసుకోవటం ముఖ్యం. అలా తెలుసుకోవటానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. కొన్ని రకాల పనులు చేసే పెళ్లయిన మహిళలకు ఎఫైర్ ఉండే అవకాశం ఉందని ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ సైట్ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ సైట్ వెల్లడించిన వివరాల మేరకు.. మీ భార్య ఈ పనులు చేస్తుంటే గనుక ఎఫైర్ పెట్టుకుందని అనుమానించొచ్చు..
1) తప్పుడు పనులు చేసే మహిళలు తమ ఫోన్‌ను ఎక్కువగా దాస్తూ ఉంటారు. తమ ఫోన్‌ను వారు తాకనీయరు. ఎంతో జాగ్రత్తగా అందులో సీక్రెట్‌లను మోస్తూ ఉంటారు. అలాంటి వారు ఫోన్‌కు కట్టుదిట్టమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటూ ఉంటారు.
2) వేరే వ్యక్తి మోజులో పడ్డ ఆడవాళ్లు భర్తలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. భర్తలకు సమాధానాలు ఇవ్వటంలో అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవటం మానేసి తిరిగి ప్రశ్నిస్తుంటారు.
3) భార్యను ఏ విషయం గురించైనా గట్టిగా ప్రశ్నించినపుడు ఎమోషనల్ అవుతుంటారు. వారి ప్రవర్తనలో కూడా వెంటనే మార్పు వస్తుంది. భర్తలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటానికి చూస్తూ ఉంటారు.
4) భార్యాభర్తల మధ్య శృంగారం విషయంలో గ్యాప్ వస్తుంది. వేరే వ్యక్తి మోజులో పడ్డ వారు భర్తలతో కలిసి జీవించటానికి అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా భర్తతో శృంగారం చేయటానికి ఆసక్తి చూపించరు. కొంతమంది అయిష్టంగా శృంగారంలో పాల్గొంటారు. మరికొంతమంది ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు.
5) మహిళలు ఎప్పుడూ ఒకే వేషధారణలో ఉంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ, వారి వేషధారణలో సడెన్ మార్పులు రావటం వంటివి చోటుచేసుకుంటే అనుమానించాల్సిందే.
6) భార్యాభర్తల మధ్య అన్ని విషయాల్లో సీక్రెట్స్ అంటూ ఉండవు. కానీ, వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న మహిళలు ప్రతీ విషయంలో రహస్యాలు మెయిన్‌టైన్ చేస్తుంటారు.
7) పరాయి వ్యక్తి మోజులో ఉన్న మహిళల మొదటి లక్షణంలో అబద్ధాలు ఆడటం అన్నది మొదటిది. ఇలాంటి ఆడవారు తరచుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు.
గమనిక : ఈ విషయాలు కేవలం ఆ ఇంగ్లీష్ సైట్ ప్రచురించిన వివరాలను దృష్టిలో ఉంచుకుని రాసినవి మాత్రమే. భార్యలను అనుమానించే భర్తలు అన్ని కోణాల్లో వారిని పరిశీలించాలి. ఏదో ఒక అనుమానంతో భార్యలపై నిందలు వేయకూడదు. మీలో లోపమా.. లేదా వారిలో లోపమా అన్నది తెలుసుకోవటం ఇబ్బంది అయితే, మానసిక వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. తొందరపడి అనుమానించి తర్వాత ఇబ్బంది పడటం మంచిది కాదు.