సంసారం ఎప్పుడూ ఆనందంగా, సుఖంగా ఉండాలి. ఇలా జరగాలంటే భార్యభర్తల మధ్య అవగాహనచాలా అవసరం.పెళ్లి చేసుకోబోయే ముందు ఆడ, మగకు జీవితంపై ఒక క్లారిటీ ఉండాలి. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించుకోవాలి. తాము కలిసి జీవితంలో ముందుకు పోవాలి కాబట్టి.. ఒకరి అభిరుచులు మరొకరు పంచుకుని ఉండాలి. ఆర్థిక పరమైన అంశాల పట్ల ఒక స్పష్టమైన అవహగానతో ముందుకి వెళ్ళాలి. ఒకరి బంధువులను మరొకరు గౌరవించుకోవడం, పిల్లల పెంపకం విషయంలో ఇద్దరు సమానమైన బాధ్యత పంచుకోవడం వంటి అంశాలను చాలా గట్టిగా ఆచరించగలగాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎవరి జీవితమైనా, ఎవరి సంసారమైన ఆనందంగా సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది.
ఇక మారుతున్న కాలంలో ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో భార్యభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేయడం చాలా అవసరం. కానీ.., చాలా మంది స్త్రీలు బయటకి వెళ్లి జాబ్స్ చేయడానికి భయపడుతూ ఉంటారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి.. ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఇక బయట టెన్షన్స్ తో ఉండే భర్తకి అండగా ఉంటూ.. అతని సేద తీర్చే బాధ్యత కూడా స్త్రీ తీసుకుంటే ఆ కుటుంబం అటు ఆర్థికంగా, ఇటు ఆనందంగా కూడా ఉంటుంది.