ఈ సృష్టిలో అన్ని జీవులు అనుభవించగలిగే అనుభూతి శృంగారం. ఒక్కో జీవి ఒక్కో విధంగా దీన్ని అనుభూతి చెందుతుంది. మనుషుల విషయానికి వచ్చే సరికి అనుభూతితో పాటు బంధాన్ని పెంచే ఎమోషన్‌గా శృంగారం పనిచేస్తుంది. అయితే, కొన్ని సార్లు తమ కోర్కెలు తట్టుకోలేక మనుషులు తప్పులు చేస్తూ ఉంటారు. అలా తప్పులు చేసి జైలు పాలయ్యేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా రేపులు చేసేశారు. రేపులు ఎందుకు జరుగుతున్నాయి? అన్నదానిపై ప్రముఖ సైకాలజిస్ట్, న్యూరోమెంటర్ పూజితా జోష్యుల వివరణ ఇచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ రేపులు చేసే వారు ఎంజాయ్ చేయటానికి అలా చేయరు. పరిశోధనల్లో ఏం తేలిందంటే.. తమ శారీరక కోర్కెలను తీర్చుకోవటానికి మాత్రమే అలా చేస్తారంట. ఒకరకంగా చెప్పాలంటే.. నీరు, అన్నం ఎలాగో.. శృంగారం కూడా అలాగే. ఈ మధ్య కాలంలో పోర్న్ వీడియోలు చూడటం.. వాటిని చూసి ఫాంటసీలోకి వెళ్లిపోవటం.. ఏవేవో ఊహించుకోవటం.. అలా చేయటానికి సెక్స్ పార్ట్‌నర్స్ లేకపోవటం, ఉన్నా ఒప్పుకోకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. చాలా రేపులు మద్యం మత్తులోనో, డ్రగ్స్ మత్తులోనో జరుగుతున్నాయి. ఆ టైం వారికి ఏదీ గుర్తు ఉండదు.
ఏది పడితే అది చేసేస్తారు. మత్తు దిగిపోయిన తర్వాత అడిగితే ఏదీ గుర్తులేదని చెబుతారు. ఆనందం కోసం, ఎంజాయ్‌మెంట్ కోసం చేశామని ఎవ్వరూ చెప్పరు. కొన్ని విషయాల్లో బిగ్ షాట్స్, బిజినెస్ మ్యాన్‌ల స్కాండల్స్ బయటపడుతూ ఉంటాయి. వీటిలో ఎక్కువగా సెక్స్ వర్కర్స్‌నే కార్నర్ చేస్తుంటారు. గతంలో కొత్త బంగారు లోకం హీరోయిన్‌ను ఇలానే చేశారు. ఆమె గురించి చాలా కథనాలు రాశారు. ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ల తప్పులేదని తెలిసినా.. వాళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం పొట్టకూటి కోసం ఈ పనులు చేసే వారినే టార్గెట్ చేస్తుంటారు. బిగ్‌షాట్స్ పేర్లు బయటకు రావు’’ అని అన్నారు.