ప్రపంచం మొత్తంలో శాకాహార ప్రియుల కంటే మాంసాహార ప్రియులే ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడు చాలా మంది మాంసాహారం మాని.. శాకాహారులుగా మారుతున్నారు. వారి శరీరానికి మాంసం పడకపోవడం, మాంసం కోసం జీవహింస చేస్తారనే భావన వంటి కారణాలు ఉండచ్చు. అయితే అలాంటి కారణాలతో మాసం మానేసిన వారికి ఇది గొప్ప శుభవార్తనే చెప్పాలి. అలాగే శాకాహారులు కూడా మాంసం రుచి చూసే అవకాశం దగ్గర్లోనే ఉంది. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తరకం చికెన్ ఒకటి అందుబాటులోకి వస్తోంది. అయితే ఆ చికెన్ కోసం మీరు కోడిని చంపాల్సిన అవసరమే లేదు. దానినే సెల్ కల్చర్డ్ చికెన్ అంటారు. అసలు ఆ సెల్ కల్చర్డ్ చికెన్ అంటే ఏంటి? దానిని ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూద్దాం.
మాంసం కోసం జీవహింస చేస్తారనే కారణంతో చాలామంది శాకాహారులుగా మారిపోతున్నారు. ఆ కారాణంగానే మాంసం తినకుండా ఎంతోమంది ఉండిపోతున్నారు. అయితే ఇకనుంచి కోడిని చంపకుండానే కోడి మాంసం తయారు చేయచ్చు. అవును ఇకనుంచి చికెన్ ను పండించుకోవచ్చు. దానిని సెల్ కల్చర్డ్ చికెన్ అంటారు. దాని రుచి, ఫ్యాట్, ప్రొటీన్స్ అన్నీ చికెన్ తరహాలోనే ఉంటాయి. పైగా ఈ చికెన్ ని ఎవరైనా తినచ్చు. శాకాహారాలు, అలర్జీస్ కారణంగా మాంసానికి దూరంగా ఉన్న వాళ్లు కూడా ఈ మాంసాన్ని తినచ్చు.
ప్రపంచవ్యాప్తంగా రోజుకి 27.6 కోట్ల కిలోల చికెన్ వినయోగం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకోసం అత్యధికంగా బ్రాయిలర్ కోళ్లనే వినియోగిస్తున్నారు. అయితే అంత మాంసం కోసం కోట్లలో జీవులను చంపాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జీవహింస లేకుండా చికెన్ తయారు చేసే విధానాన్నే సెల్ కల్చర్డ్ చికెన్ అంటారు. ఇందులో కోడి నుంచి స్టెమ్ సెల్స్(జంతు కణాలు) సేకరించి వాటి ద్వారా ఈ కల్చర్ట్ మీట్ ని తయారు చేస్తారు. మొదట ఈ మీట్ తయారు కావడానికి 14 రోజుల సమయం పడుతుంది. అయితే ఒకసారి తయారైన తర్వాత 18, 24 గంటల్లోనే మాంసం రెట్టింపు ఉత్పత్తి అవుతుంది.
పైగా ఈ సెల్ కల్చర్డ్ మీట్ లో అసలు సిసలైన చికెన్ లో ఉండే పోషకాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు అన్నీ ఈ చికెన్ లో ఉంటాయి. శాకాహారులు కూడా ఈ మాంసాన్ని లొట్టలేసుకుంటే లాగించేయచ్చు. కోడి లేకుండానే కోడి మాంసం తయారు చేయడమే కాకుండా.. అమెరికాలోని ‘అప్‌సైడ్ ఫుడ్స్’ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతులు కూడా పొందింది. పైగా ఈ తరహా మాంసం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కూడా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్ లో ఈ సెల్ కల్చర్డ్ చికెన్ 10 శాతం వాటా సొంతం చేసుకుంటుందని అంచనాలు వేస్తున్నారు.
ఈ సెల్ కల్చర్డ్ చికెన్ తయారీలో కీలకపాత్ర పోషించింది, అప్‌సైడ్ ఫుడ్స్ సీఈవో, కో ఫౌండర్ తెలుగు వాడైన ఉమా వాలేటినే. ఉమా వాలేటి కార్డియాలిజిస్ట్ మాత్రమే కాకుండా.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ కూడా. ఈ సెల్ కల్చర్డ్ మీట్ గురించి ఉమా వాలేటి మాట్లాడుతూ.. “ఈ సెల్ కల్చర్డ్ మాంసం ఉత్పత్తికి ఎఫ్డీఏ అనుమతి పొందిన తొలి సంస్థ మాది కావడం సంతోషంగా ఉంది. ఈ తరహా మాంసం కోసం పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు కూడా చేశాం. భవిష్యత్తులో పశు మాంసం, బాతు, ఎండ్రకాయ కూడా సెల్ కల్చర్డ్ లో ఉత్పత్తి చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ తరహా మాంసం తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని పరిశోధనల్లో వెల్లడైంది” అంటూ ఉమా వాలేటి వెల్లడించారు. ఇంక ఈ చికెన్ భారతీయులు తినాలి అంటే దాదాపు ఐదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. 2028నాటికి ఈ మాంసం భారత్ లో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
We wrote an open letter to chickens to tell them we received an “NQL” from the FDA, accepting our safety conclusion that UPSIDE’s cultivated chicken will be available following USDA inspection & label approval.🐔 Don’t read chicken? Read the translation at https://t.co/5mGA8U8XLl pic.twitter.com/pz4enFKYZA
— UPSIDE Foods (@upsidefoods) November 18, 2022