అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అందుకోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. అందం విషయంలో అమ్మాయిలకు కాస్త శ్రద్ధ ఎక్కువ. అందంగా కనిపించడం కోసం ఎంత కష్టమైన పడతారు. మరీ ముఖ్యంగా సినిమా తారలను చూసి వారిలా మారడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే ఆ పిచ్చిలో పడి రకరకాల ఆపరేషన్‌లు చేయించుకుని.. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. ఈ కోవకు చెందిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా కొందరు మాత్రం మారరు. ఈ క్రమంలో తాజాగా అందం కోసం కోట్లు ఖర్చు చేసి.. రకరకాల సర్జరీలు చేసుకుని.. ఆఖరికి తత్వం బోధపడిన ఓ యువతి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
అమెరికన్ సోషల్ ఫిగర్, సెల్ఫ్ మేడ్ బిలియనీర్ కిమ్ కర్దాషియన్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమెలా అందంగా కనిపించాలని చాలా మంది ఆశపడతారు. ఆ కోవకు చెందిన యువతి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కిమ్ కర్దాయియన్‌లా మారాలని ఓ యువతి కలలు కన్నది. ఆమె పేరు జెన్నిఫర్ పాంపలోనా(29). సొంత దేశం బ్రెజిల్. ఇటలీ టాప్ కంపెనీ వర్‌సేస్‌లో మోడల్‌గా పని చేసేది. కాలేజీ రోజుల్లో.. చదువులో బాగా రాణించడమే కాక వృత్తి జీవితంలోను విజయం సాధించి.. ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ఉమెన్‌గా రాణించాలనుకుంది. అందుకు గాను కిమ్ కర్దాషియన్‌లా ఉంటేనే తనకూ గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్ అయ్యింది.
పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్లింది పాంపలోనా. ఎందుకంటే.. ఆ టైంకే కర్దాషియన్‌కు పేరుప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి. కిమ్‌లాంటి ఒంపుసొంపులు రావాలని సర్జరీలతో ఒళ్లు హూనం చేసుకుంది. పెదాలు, వక్షోజాలు, పిరుదులు.. ఇలా శరీర సౌష్టవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది. నెమ్మనెమ్మదిగా.. కిమ్ కర్దాషియన్‌లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది. మోడలింగ్‌లో బోలెడు అవకాశాలు దక్కాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరుగుతూ వెళ్తున్నారు. సర్జరీల కోసం ఆరు లక్షల అమెరికన్ డాలర్లు(నాలుగున్నర కోట్ల రూపాయలపైనే) ఖర్చు చేసింది.
అంతా ఆమెకు అనుకూలంగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది. పోనుపోనూ ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది. తన శరీరం సహజత్వం కోల్పోయినట్లు గుర్తించింది. అంతేకాక శరీరం తన అదుపు తప్పిందని తెలియవచ్చింది. సర్జరీలకు అలవాటు పడిపోయి.. సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం మొదలైంది. పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా.. ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అందులో భాగంగా ఇస్తాంబుల్‌లో ఓ ఫిజీషియన్‌ను కలిసి.. తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది. ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది. గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె.. మరోలా బయటకు వచ్చింది. డీట్రాన్సిషన్ కోసం దాదాపు మన కరెన్సీలో కోటి రూపాయాల దాకా ఖర్చు చేసింది. తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె.జెన్నిఫర్ పాంపలాకు.. ఇప్పుడు తనలో తాను మధన పడాల్సిన అవసరం లేదు. జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది. జీవితమంటే పరిపూర్ణం కాదు. ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఆ లోపాలను స్వీకరిస్తూ ముందకు సాగాలి. విజయ తీరాలను అందుకోవాలి. అంతేగానీ.. సహజ విరుద్ధమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చుకుందట. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని మోడల్స్‌కు సలహా ఇస్తోంది.
ఇక సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్.. ఎబోట్ ది డేంజరస్ ఆఫ్ ది ఆపరేషన్స్’ పేరిట తీసే డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది. తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్. అంతేకాదు.. డీట్రాన్సిషన్ సెల్ఫీలను సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ చేస్తోంది కూడా. ప్రసుత్తం ఆమె కథ నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.