భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. మూడు ముళ్ల బంధం ఇద్దరు మనుషులను ఒకటి చేయడమే కాదు.. రెండు కుటుంబాలను ఏకం చేస్తుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు చేసే ప్రతి పని ఆ రెండు కుటుంబాల పరువు, పిల్లల భవిష్యత్ పై ప్రభావం చూపుతుంది. గతంలో అయితే ఈ భయాలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం సమాజంలో పరువు, ప్రతిష్ట వంటి వాటిని లెక్క చేయడం లేదు. క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వారిని మోసం చేయడం, నమ్మి వచ్చిన వారిని కడతేర్చడం చేస్తున్నారు. కొందరు కేవలం సరదా కోసం ఇలాంటి పనులు చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం దిక్కుతోచక ఇలా చేస్తున్నారంటూ ఫ్యామిలీ కౌన్సిలర్ పద్మా కమలాకర్ చెబుతున్నారు.
ఆవిడ ఏం చెబుతున్నారంటే.. “సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. నా దగ్గరకు కూడా చాలా మంది ఈ సమస్యతో వస్తున్నారు. ఒక భార్య ఇలాగే వచ్చింది. ఆమె భర్త ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆఫీస్ లో వర్క్ చేయడం, ఇంటికి వచ్చి ల్యాప్ ట్యాప్ ముందేసుకుని పని చేసుకోవడం. అతను అసలు ఆమెను పట్టించుకోవడం కూడా లేదు. ఆమె భర్త మిత్రుడితో పరిచయం పెంచుకుంది. కొన్నాళ్లు మాట్లాడుకున్న తర్వాత వారి సంభాషణ సె*క్స్ దాకా వచ్చింది. ఆ భార్య భయంతో నా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. ఆమె అలా మారిపోవడానికి కారణం కేవలం ఆ భర్త చేసే నిర్లక్ష్యమే” అంటూ చెప్పుకొచ్చారు.
అంటే ఆఫీస్ లో పని, ఇంట్లో కూడా ఆఫీస్ పనుల గురించే ఆలోచించుకుంటూ కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం. అసలు ఆమె ఉంది అనే విషయాన్నే మర్చిపోవడం చేస్తున్నారు. అదే పెద్ద సమస్య అని చెబుతున్నారు. భర్త దగ్గర శృంగారం సంగతి పక్కన పెడితే కనీసం ప్రేమ కూడా దొరక్క చాలా మంది భార్యలు ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారని తెలిపారు. భర్తలు ఎప్పుడైతే భార్యకు సరైన సమయాన్ని కేటాయిస్తారో, ప్రేమను పంచుతారో వారికి ఎలాంటి కష్టం, నష్టం ఉండదన్నారు. కానీ, భార్యని పట్టించుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలు, యువతులకు డాక్టర్ పద్మా కమలాకర్ పలు సూచనలు చేశారు. సె*క్స్ అంటే ఏముంది.. కాసేపు పడుకుని వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ, అరగంట మీరు చేసే పని తర్వాత మీ రోజు 23.30 గంటల సమయాన్ని నాశనం చేస్తుంది. ఒక మహిళ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోటీగా ఆమె కూడా మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకుందట. తర్వాత వాళ్లు శారీరకంగానూ దగ్గరయ్యారు. కానీ, ఆమెకు మనసులో ఒక తప్పు చేశానే భావన ఏర్పడిందట.
ఆ మహిళ డిప్రెషన్ లోకి వెళ్లిపోయ బట్టలు చింపుకునే స్థితికి దిగజారిపోయిందట. అందుకే మహిళలు, యువతులు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సిటీకి చదువుకోవడానికి వచ్చే యువతులు కూడా అక్రమసంబంధాలు, శృంగారం, శారీరక కోరికలు వంటి వాటికి దూరంగా ఉండాలని.. ముందు చదువు మీద దృష్టి పెట్టాలంటూ చెప్పారు. ఒక స్త్రీ, తల్లి, మహిళ జాగ్రత్తగా ఉంటేనే సమాజం జాగ్రత్తగా ఉంటుందని తెలియజేశారు. భర్తలు కూడా భార్యలకు సముచిత స్థానం ఇచ్చి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు.