పురుషుల్లో సర్వ సాధారణంగా కనిపించే శృంగార సమస్య ‘‘ ఎరెక్టల్ డిస్ ఫంక్షన్’’. దీన్నే తెలుగులో అంగస్తంభన సమస్య అంటారు. ఈ సమస్య కారణంగా మగాళ్లు తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య బంధం దెబ్బతింటుంది. అక్రమ సంబంధాలకు దారి తీస్తుంది. అంగస్తంభన సరిగా కాకపోయినా.. ఎక్కువ సేపు ఇంటర్ కోర్సులో ఉండలేకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక, ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ గురించి ప్రముఖ డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ‘‘ ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ అంటే అంగం స్తంభించటంలో సమస్యలు ఉండటాన్ని ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ అంటారు. ఇంటర్ కోర్స్ సమయంలో మగాళ్ల అంగం గట్టి పడాలి. అప్పుడే స్త్రీ యోనిలోకి వెళ్లటానికి అనువుగా ఉంటుంది. అంగం అలా గట్టి పడటాన్ని ఎరెక్షన్ అంటారు.
ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ అంటే శృంగారం సమయంలో అంగం వెంటనే గట్టి పడకపోవటం.. అంగం గట్టిపడినా కూడా ఇంటర్ కోర్స్ సమయంలో ఎక్కువ సేపు ఉండకపోవటం వంటి వాటి వల్ల వారికి ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ ఉంది అని చెప్పొచ్చు. ఇది అసాధారణమైన సమస్య కాదు.. దీన్ని 20-30 శాతం మగాళ్లలో చూస్తూ ఉంటాం. దీని గురించి మీ డాక్టర్‌తో చర్చించండి. మీ భాగస్వామితో చర్చించండి. ఇందులో ఏదైనా సమస్య ఉంటే డాక్టర్‌తో మాట్లాడటానికి హెసిటేట్ అవొద్దు. సాధారణంగా ఎరెక్షన్ ఎలా జరుగుతుందంటే.. మగాళ్లలో శృంగార కోర్కెలు మొదలైనపుడు సెక్స్ హార్మోన్లు విడుదల అవుతాయి.
వాటి వల్ల బ్లడ్ ఫ్లో శరీరంలో పెరుగుతుంది. అంతేకాదు! ఎక్కువ మొత్తంలో బ్లడ్ ఫ్లో అంగానికి చేరుతుంది. బ్లడ్ ఫ్లో కారణంగా అంగం గట్టిపడుతుంది. కానీ, ఏదైనా కారణంగా బ్లడ్ ఫ్లో సరిగా లేకపోయినా.. కోర్కెలు కలిగినపుడు సెక్స్ హార్మోన్లు సరిగా రిలీజ్ కాకపోయినా వీటన్నిటి వల్ల ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ రావచ్చు. సాధారణంగా ఎరెక్టల్ డిస్ ఫంక్షన్‌కు ఓ నాలుగు కారణాలు ఉంటాయి. మొదటిది సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉండే మగాళ్లలో ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. బ్లడ్ వెసెల్స్ కుంచించుకుపోయి ఉంటాయి.
ఇంకొంతమందిలో సెక్స్‌లో పాల్గొనే సమయంలో కొంత కంగారు మొదలవుతుంది. సెక్స్ సరిగా చేస్తామా? లేదా? పార్ట్‌నర్‌ను సంతృప్తి పరుస్తామా? లేదా? అన్న డౌట్ క్రియేట్ అవుతుంది. నెగిటిల్ థాంట్స్ ఉన్నపుడు హార్మోన్‌లు తగ్గి ఎరెక్షన్ అవ్వదు. తర్వాత కూడా ఇదే కొనసాగుతుంది. దీన్నే సైకో జెనిక్ ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ అంటారు. ఇదో మానసిక సమస్య లాంటిది. వీరిని కౌన్సిలింగ్, మందులతో బాగు చేయవచ్చు. ఇక, సరైన నిద్ర లేకపోయినా ఎరెక్టల్ డిస్ ఫంక్షన్ వస్తుంది. శృంగారంలో బాగా ఉండాలంటే ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం’’ అని ఆమె అన్నారు.