China Woman Loss 40 Kgs Weight Over A Year: బరువు.. ఇప్పుడు మన సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య. ప్రస్తుతం బాల్యం నుంచే చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాల్యంలో పెద్దగా పట్టించుకోరు. కానీ యుక్త వయసుకు వచ్చాక.. మాత్రం చాలా మంది మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఇతరులతో పోల్చుకుని.. వారి కంటే లావుగా ఉన్నామని భావించి.. కడుపు మాడ్చుకుని.. జీరో సైజ్ మెయిన్‌టెయిన్ చేస్తారు. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నా సరే లావుగా ఉన్నామని భావించి.. సన్నగా అయ్యేందుకు కడుపు మాడ్చుకుని తమను తాము కష్టపెట్టుకుంటారు. మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉంటే సమస్య.. దాన్ని కూడా ఆరోగ్యకరమైన పద్దతుల్లో తగ్గించుకోవాలి. అంతేకాని.. పూర్తిగా కడుపు మాడ్చుకుని డైటింగ్ చేస్తే.. ఇదిగో ఈ మహిళలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ వివరాలు..
చైనాలోని హెబీ ప్రావిన్స్‌కు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ(పేరు వెల్లడించలేదు) కేవలం ఏడాది వ్యవధిలోనే 40 కిలోల బరువు కోల్పోయింది. రెండవ బిడ్డను ప్రసవించిన తర్వాత, ఆమె బరువు 65 కేజీలకు చేరుకుంది. భారీగా బరువు పెరిగానని భావించిన సదరు మహిళ డైటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఏడాదిలోనే ఆమె తన శరీర బరువును సగానికి పైగా కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో హెంగ్‌షుయ్ నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Samantha Ruth Prabhu: వైరలవుతోన్న సమంత పాత యాడ్స్! అప్పుడు ఎలా ఉందో చూడండి!
25 కేజీల బరువుతో.. నడుస్తున్న అస్థిపంజరాన్ని తలపించేలా ఉన్న ఆమెను చూసి వైద్యులు షాకయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇది కేవలం ఆహారపు అలవాట్ల వల్ల ఏర్పడే వ్యాధి. అప్పటికే ఆమె ఆరోగ్యంపై ఆ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల ఆమె అవయవాలు దాదాపు పనిచేయడం మానేశాయి. జుట్టు రాలడం, జీర్ణాశయం, గుండె సమస్యలతో బాధపడుతోంది. రుతుక్రమం ఆగిపోయింది.
ఇది కూడా చదవండి: Salman Khan: సల్మాన్ ఖాన్ ని ‘అంకుల్’ అని పిలిచిన హీరోయిన్.. వీడియో వైరల్!
ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘బాధితురాలికి ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే వ్యాధి ఉంది. ఆమె గత కొన్నాళ్లుగా ఆహారం ముట్టడం లేదు. ఫలితంగా అవయవాల వైఫల్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఆమె ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య పరిస్థితి గురించి చెప్పాం. జీవనశైలిలో మార్పులు అవసరమని తెలిపాం. కానీ, ఆమెకు అందుకు ఆసక్తి చూపడం లేదు. ట్రీట్మెంట్‌ను కూడా తిరస్కరించింది. బరువు తగ్గడం కోసం ఆమె ఆహారం మానేయడమే కాదు.. క్యాతార్టిక్స్, లాక్సిటివ్స్, ఆక్యుపంక్చర్ తదితర పద్ధతులను ప్రయత్నించానని మాకు తెలిపింది’’ అని వెల్లడించారు. ఈమె పరిస్థితి గురించి తెలుపుతూ.. అక్కడి వైద్యులు చైనా యువతుల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా సంస్కృతిలో సన్నగా ఉండే అమ్మాయిలనే అందంగా ఉన్నట్లు పరిగణిస్తారు. నాజుగ్గా ఉండాలని భావించి అస్తిపంజరంలా మారిన ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Suriya – Kajal: ఆరోజుల్లోనే ఎంత మోసం చేశారు? కాజల్ తో ముద్దు సీన్ నిజం కాదా?