భార్యాభర్త అన్నాక చిన్నపాటి అరమరికలు, అలకలు, మనస్పర్థలు సహజం. ఎంత ఎక్కువగా గొడవలు పడితే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అనే కొటేషన్లు కూడా చూస్తూనే ఉంటాం. అయితే ఇద్దరు వ్యక్తులు ఒక పరిస్థితిని ఒకేలా చూడాలి అని లేదు. ప్రతిసారి ఇద్దరూ ఒకేలా ఆలోచించాలి అని కూడా లేదు. అలాంటప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే ఆ చిన్న గొడవలను అక్కడితో వదిలేస్తే సంసారం సాఫీగా సాగిపోతుంది. అయితే కొందరు మాత్రం ఆ గొడవలను బూతద్దంలో చూస్తూ వాటిని ఇకా పొడిగిస్తూ పోతుంటారు. అలా చేయడం వల్ల చిన్న గొడవ కాస్తా.. వారి మధ్య పెద్ద గోడను కట్టేస్తుంది. అయితే అది గొడవగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ గొడవను ఆసరాగా తీసుకుని వేరే వాళ్లతో బంధాన్ని మొదలు పెడుతున్నారు. అదికాస్తా కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యేలా చేస్తున్నాయి.
అలాంటి ఓ తప్పు చేసిన ఓ యువతి.. ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ అందమైన జీవితానికి కాల్ చేసింది. ఆమె ఏం చెప్పిందంటే.. ఆమె భర్త సంపాదనే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాడంట. అతనికి భార్యపై ప్రేమ లేదని.. అసలు ఆమెను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ఆమెకు ఇల్లు తప్పితే మరో లోకం తెలియదని తెలిపింది. ఇంట్లో తానొక మనిషి ఉందనే విషయం కూడా అతనికి గుర్తుండని ఆవేదన వ్యక్తం చేసింది. వారికి ఒక పాప కూడా ఉంది. అతని భర్తే ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె ఎంతో కుమిలి పోయింది. ఆమెపై రిలేషన్‌షిప్ కౌన్సిలర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి కూడా ఎంతో జాలి పడ్డారు. ఆమె భర్తతో మాట్లాడి వారి కుటుంబాన్ని చక్కదిద్దాలి అని అనుకున్నారు. అయితే తర్వాత ఆమె ఏం చెప్పబోతోంది అనే దానిపై వారికి ఏ మాత్రం క్లూ లేదు.
అయితే ఆ యువతి తన కథలో సగం మాత్రమే వారికి చెప్పింది. సెకండ్ హాఫ్ చెప్పగానే డాక్టర్‌కి కూడా మైండ్ బ్లాక్ అయ్యింది. ఆమె ముందు భర్తను బూచిగా చూపించడానికి ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే తర్వాత ఆమె తప్పుని చెప్పేందుకు ముందు భర్తను అలా బ్యాడ్ చేసింది. ఈమె ఇంటి ఎదురుగా ఓ కుర్రాడు ఉంటూ ఉంటాడు. అతనికి పెళ్లి కాలేదు. పొద్దున్నే మేడపై జిమ్ చేస్తూ ఉంటాడు. మొదట్లో ఆమెను ఆ కుర్రాడిని పట్టించుకోలేదు. కానీ, తర్వాత వాళ్ల చూపులు కలిశాయి. అతను పేపర్ మీద నంబర్ రాసి విసిరేయగానే వారి మాటలు కూడా కలిశాయి. ఇంకేముంది అతనితో చీకటి బంధానికి తెర లేపింది. అతనితో చెట్టాపట్టాలు వేసుకుని తిరేగిసింది కూడా. భర్త ఆఫీస్‌కి వెళ్లగానే బాయ్‌ఫ్రెండ్‌తో సరసాలు కూడా మొదలు పెట్టేసింది.
ఈ సెంకడ్ హాఫ్ విన్న తర్వాత వారికి ఏం అర్థం కాలేదు. భర్త గురించి చెప్పినంతసేపు వారికి ఆమెపై ఎంతో గౌరవం ఉంది. కానీ, బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పగానే వారికి ఆమెపై గౌరవం చచ్చిపోయింది. ఆఫీస్‌కి వెళ్లిన భర్తను ఇలా మోసం చేయడం తెలుసుకుని అతనిపై జాలి పడ్డారు. కానీ, ఆమె చేసిన పనికి మాత్రం సిగ్గు పడాలంటూ క్లాస్ పీకారు. ఆ కుర్రాడు పైగా సంవత్సరం నుంచి పెళ్లి చేసుకోకుండా ఈమె ఆగుతున్నాడని తెలిసి ఇంకా కోపడ్డారు. అతను ఇంట్లో వారిని ఎదిరించలేక పెళ్లిచూపులకు ఒప్పుకున్నాడట.. అయితే నన్ను ఏం చేయమంటారు అంటూ ఆమె అడగింది. ఆ ప్రశ్న వినగానే డాక్టర్‌కి చిర్రెత్తుకొచ్చింది. భర్తను, పిల్లల్ని మోసం చేస్తుంది చాలక.. ఏం చేయమంటారు అని అడుగుతావా అంటూ క్లాస్ పీకారు. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే ప్రస్తుతం ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. కొందరు బయటపడుతున్నారు.. కొందరు చీకట్లోనే బంధాలను కొనసాగిస్తున్నారు.