పార్ట్ టైమ్ జాబ్స్ అంటే వెంటనే స్కామ్ అనో, మోసం అనో అనుకుంటారు. కానీ ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పార్ట్ టైమ్ జాబ్స్.
మీరు ఏదైనా పని చేస్తూ ఖాళీ సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేయాలని అనుకుంటున్నారా? అది కూడా ఇంట్లోనే ఉంటూ సంపాదించాలని అనుకుంటున్నారా? ఇంట్లో ఉంటూ 20 నిమిషాలకు రూ. 500 సంపాదించుకోవచ్చు. అంటే ఒక గంట పని చేస్తే రూ. 1500 సంపాదించుకోవచ్చు. ఇదేమీ ప్రైవేటు జాబ్ కాదు. స్వయంగా ప్రభుత్వమే ఇస్తున్న ఉద్యోగం. స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా (స్పైర్ ల్యాబ్) ఈ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ వంటి స్పీచ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ని ప్రభుత్వం సృష్టించింది. ఇందులో స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, సెంటెన్స్ కంపోజిషన్, సెంటెన్స్ ట్రాన్స్లేషన్, కంటెంట్ రైటర్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి. ప్రస్తుతం మూడు రకాల పార్ట్ టైమ్ జాబ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
జాబ్ ప్రొఫైల్: మీ స్థానిక యాసలో వాక్యాలను కరెక్ట్ గా అమర్చాలి.