విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం కొంతమంది డిగ్రీలు చేస్తారు. మరికొంత మంది ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు చూపుతారు. మరి ఇటువంటి కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ వంటి అర్హత పరీక్ష రాయాల్సిందే. ఎంసెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థులకు ఇది శుభవార్త అని చెప్పాలి.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్ జెఎన్ టియు క్యాంపస్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా అగ్రికల్చర్, ఫార్మా, ఇంజనీరింగ్ విభాగాల్లో అభ్యర్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. ఈ ఫలితాల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 80శాతం మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. మొత్తం 94.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఆ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే టిఎస్ ఎంసెట్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడ్డారు. ఈ పరీక్షలకు 3,20,683 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా వీరిలో 3,01,789 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 2,35,918 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 65,871 మంది విద్యార్థులు పరీక్షలు రాసారు. స్థానిక కోటా కింద తెలంగాణ రాష్ట్ర అభ్యర్ధులకు 85 శాతం సీట్లను, మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయించనునున్నారు. ఇంటర్ వెయిటేజీ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు