ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్లను అస్సలు మిస్ చేసుకోకండి. తక్కువ ఉద్యోగాలు కనుక దరఖాస్తులు అదే స్థాయిలో ఉండవచ్చు. కావున ఉద్యోగం సాధించడం అతి సులువు.
నిరుద్యోగులకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఆర్‌ఈఐఆర్‌బీ) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో డైరెక్ట్ ప్రాతిపదికన లైబ్రేరియన్(స్కూల్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 434 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 434
సొసైటీల వారీగా ఖాళీలు
విద్యార్హతలు: డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ క్పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంది.
జీతభత్యాలు: ఎంపికైన వారికి నెలకు రూ.38,890 నుంచి రూ.1,12,510 వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్–1, పేపర్–2), సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24.04.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 25.05.2023