ప్రభుత్వ కొలువు సాధించడమే మీ లక్ష్యమా..? అది కూడా ఉపాధ్యాయ వృత్తి అంటే మీకు ఇష్టమా..? అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. టీచర్ ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.
టీచర్‌గా స్థిరపడానులుకుంటున్న వారికి గుడ్ న్యూస్. తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రకటన ద్వారా 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 3,012 అంటే దాదాపు 75 శాతం ఉద్యోగాలు మహిళలకే దక్కనున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మే 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోగలరు. తొలుత 4,020 టీజీటీ పోస్టులు ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, దివ్యాంగుల సంక్షేమశాఖలోని 14 పోస్టులకు సర్వీసు నిబంధనలు రాకపోవడంతో తాజా ప్రకటనలో చేర్చలేదు.
మొత్తం ఖాళీలు: 4,006
సొసైటీల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హతలు: జనరల్ అభ్యర్థులకు బీఏ, బీకాం డిగ్రీలో 50శాతం మార్కులు ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ, బీఈడీ, బీఎస్‌సీ బీఈడీ చదివి ఉండాలి. లేదా డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా సంబంధిత లాంగ్వేజీ లేదా ఓరియంటల్ లాంగ్వేజీలో డిగ్రీ లేదా లిటరేచర్‌లో డిగ్రీ లేదా సంబంధిత భాషలో పీజీ డిగ్రీ 50 శాతం మార్కులతో పాటు లాంగ్వేజి పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలి. వీటితో పాటు పేపర్-2లో టీఎస్ టెట్/ ఏపీటెట్/టెట్ లో పాసై ఉండాలి. అదే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీ కోర్సుల్లో 45 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: సాధారణ అభ్యర్థులు రూ.1,200, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా వయోసడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: సంబంధిత పోస్టులను అనుసరించి రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్షను మూడు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1లో 100 మార్కులకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్లభాష పరిజ్ఞానంపై ప్రశ్నలుంటాయి. అదే పేపర్-2 విషయానికొస్తే 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టులో బోధన సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు.ఇక పేపర్-3 విషయానికొస్తే 100 మార్కులకు సంబంధిత సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలుంటాయి.
రాత పరీక్షల తేదీ: ఆగస్టు(అంచనా)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28.04.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 27.05.2023