ఇంటర్, బీటెక్ పూర్తి చేసి.. సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుణ్ణు అని భావిస్తున్నారా? అయితే మీ కోసం ఈ అవకాశం. చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఏదో ఒకటి సాధించాలన్న కసితో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. తెలంగాణ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్/అటెండర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. ఆడవారు, మగవారూ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మగవారితో పాటు ఆడవారికి కూడా దాదాపు చాలా ఖాళీలు ఉన్నాయి. ఏపీకి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? జీతం ఎంత? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.