లక్షల వేతనం వచ్చే ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారా..? అయితే అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.సంబంధిత పోస్టులను బట్టి నెలకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు.
భారత ప్రభుత్వరంగ సంస్థ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంటెక్/ ఎంసీఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 9
అర్హతలు: బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంటెక్/ ఎంసీఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: సంబంధిత పోస్టులను బట్టి అభ్యర్థుల వయస్సు 50 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టులను బట్టి నెలకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయు విధానం: ఆఫ్ లైన్.
దరఖాస్తులకు చివరితేదీ: 19.04.2023
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Chief General Manager (HR),
Telecommunications Consultants India Ltd.,
TCIL Bhawan,
Greater Kailash –I,
New Delhi – 110048